హాస్పిటల్ నుంచి ట్రంప్ డిశ్చార్జ్.. మాస్కు తీసి ఫొటోలకు ఫోజులు

Trump Mask: ఎట్టకేలకు హాస్పిటల్ నుంచి బయటపడ్డారు. అయితే Walter Reed హాస్పిటల్ నుంచి సోమవారం సాయంత్రమే వైట్ హౌజ్ కు మెరైన్ ఒన్ ద్వారా రిటర్న్ అయ్యారు. కరోనావైరస్ ట్రీట్‌మెంట్ కోసం మూడు రాత్రుల వరకూ అక్కడే గడపాల్సి వచ్చింది. వైట్ హౌజ్ కు చేరుకోగానే మాస్క్ తీసేసిన ట్రంప్.. మెరైన్ ఒన్ కు సెల్యూట్ చేశాడు.




మాస్క్ లేకుండానే Trump.. వైట్ హౌజ్ లోకి ఎంటర్ అవడంతో ఫొటోగ్రాఫర్లు ఫొటో క్లిక్ మనిపించారు. కేబుల్ న్యూస్, సోషల్ మీడియా ద్వారా అది వైరల్ అయింది. నిజానికి ట్రంప్ విషమ పరిస్థితుల్లో ఉన్నారని మాత్రమే హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. అలా అని పూర్తిగా కరోనా నుంచి కోలుకున్నట్లు కాదు. వైట్ హౌజ్ నుంచే ఆయనకు ట్రీట్ మెంట్ కొనసాగుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

తీవ్రంగా అనారోగ్యంతో ఉన్న పేషెంట్లకు ఇచ్చే dexamethasoneతో ట్రంప్ కు ట్రీట్ మెంట్ చేస్తున్నారు. నిజానికి వెంటిలేటర్ మీద ఉన్నవారి ప్రాణాలు కాపాడటానికి మాత్రమే దానిని వాడతారు. సప్లిమెంటల్ ఆక్సిజన్ తీసుకునేవారికి చాలా తక్కువ కేసులకు ఇది వర్తిస్తుంది. ట్రంప్ సమస్య నుంచి పూర్తిగా బయటపడ్డట్లు కాదు. ఫిజిషియన్లు అతని ఆరోగ్య పరిస్థితిని నిలకడగా ఉంచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని WhiteHouse స్టేట్‌మెంట్ ఇచ్చింది.


ట్రెండింగ్ వార్తలు