ట్రంప్ టీమ్ రెడీ..! ప్రో ఇండియన్స్‌కి కీలక పదవులు..

అటు మస్క్ ఇటు వివేక్... వీరిద్దరి సారధ్యంలో ప్రభుత్వం మరింత సమర్థవంతమైన పాలన అందిస్తుందన్న ఆలోచనతో ట్రంప్ ఈ పదవులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Donald Trump Team : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయడంకా మోగించిన ట్రంప్.. ఇక ప్రభుత్వ ఏర్పాటు సన్నాహాల్లో ఫుల్ బిజీ అయ్యారు. ప్రో ఇండియన్స్ కి కీలక పగ్గాలు అప్పగిస్తున్నారు. అంతేకాదు ఒక్కొక్కరుగా సమర్థులను అడ్మినిస్ట్రేషన్ టీమ్ లో నియమిస్తూ అమెరికాను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈసారి స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్ తో సంచలన నిర్ణయాలు ఉంటాయని ట్రంప్ టీమ్ ను బట్టి అర్థమవుతోంది. ఇంతకీ ట్రంప్ టీమ్ లో అమెరికా భవిష్యత్తును మార్చగలిగే గేమ్ ఛేంజర్స్ ఎవరెవరు ఉన్నారు?

వైట్ హౌస్ లో సొంత టీమ్ ను ఏర్పాటు చేసుకుంటూ పాలనలో స్పీడ్ పెంచాలని ట్రంప్ అనుకుంటున్నారు. ఇందులో భాగంగా కీలకమైన పోస్టుల్లో పలువురు సమర్థవంతులైన వారిని నియమిస్తూ తన మార్క్ చూపిస్తున్నారు ట్రంప్. సమర్థత, నమ్మకం, దేశ సమగ్రతను కాపాడే విషయంలో ఎక్కడా రాజీపడకుండా అతిరథమహారధులను తన టీమ్ మెంబర్స్ గా చేర్చుకుంటున్నారు ట్రంప్. అలా ఈసారి గతంలోకంటే ద బెస్ట్ అండ్ స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్ ను, సంచలన నిర్ణయాలను తీసుకునేలా టీమ్ ను కూర్పు చేస్తున్నారు ట్రంప్.

ఇప్పటికే టెస్లా అధిపతి ఎలాన్ మస్క్, భారత సంతతి వ్యక్తి వివేక్ రామస్వామిని డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ సంయుక్త సారథులుగా నియమించారు ట్రంప్. గవర్నమెంట్ ఎఫీషియన్సీ శాఖ డోజ్ అధిపతులుగా వీళ్లను పిలుస్తారు. ప్రభుత్వ పాలనను మెరుగుపరచడం, ఎక్కడి ఏది అవసరం, ఏది అనవసరం గుర్తించడం, వృథా ఖర్చులను నివారించడం గవర్నమెంట్ ఎఫీషియన్స్ శాఖ చేసే పని. ఈ శాఖ ప్రత్యేకమైనది. ప్రభుత్వానికి బయటి నుంచి సలహాలు, గైడెన్స్ ఇస్తుంది. ఎలాన్ మస్క్ కు బిజినెస్ స్ట్రాటజీలలో అపారమైన అనుభవం ఉంది.

సరికొత్త వ్యూహాలతో ప్రపంచంలోనే అపర కుబేరుడిగా ఎదిగిన మస్క్ ఇప్పుడు అమెరికా ప్రభుత్వంలోనూ కీలకమైన భాగస్వామి కాబోతున్నారు. అమెరికా ఆర్థిక ప్రగతికి ఉపయోగ పడే నిర్ణయాలు, సలహాలను ట్రంప్ సర్కార్ కు మస్క్ అందివబోతున్నారు.

ఇక, వివేక్ రామస్వామికి కూడా అమెరికా ఆర్థిక విధానాలు, ఫెడరల్ బ్యూరోక్రసీపై మంచి అవగాహన ఉంది. 39 ఏళ్ల వివేక్ రామస్వామి స్వతహాగా తన టాలెంట్ తో బిలియనీర్ గా ఎదిగారు. బయోటెక్నాలజీ రంగంలో కోట్లది రూపాయలు సంపాదించారు. పర్యావరణ, సామాజిక, కార్పొరేట్ గవర్నెన్స్ అనే ఈఎస్ జీ విధానాన్ని వివేక్ వ్యతిరేకించారు. అంతేకాకుండా కుటుంబ విద్యలో రిజర్వేషన్ ఉండకూడదని, అమెరికా ఆర్థికంగా చైనాపై ఆధారపడటాన్ని తగ్గించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు.

ఇప్పుడు అమెరికా నూతన పాలసీల రూపకల్పనలోనూ వివేక్ రామస్వామి కీలక కాబోతున్నారు. అటు మస్క్ ఇటు వివేక్… వీరిద్దరి సారధ్యంలో ప్రభుత్వం మరింత సమర్థవంతమైన పాలన అందిస్తుందన్న ఆలోచనతో ట్రంప్ ఈ పదవులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

* ఎన్నికల్లో ప్రసంగాలు, స్ట్రాటజీల్లో ట్రంప్ నకు సపోర్ట్ చేసిన తులసి గబ్బార్డ్
* నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా గబ్బార్డ్ నియామకం.
* వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా సుసీ వైల్స్

 

Also Read : సోషల్ మీడియా.. హద్దుల్లో లేకపోతే భారీ మూల్యం తప్పదా? ఏపీలో పరిణామాలు చెబుతోంది అదేనా?