Tunisia new govt 10 womens : ట్యునీసియా దేశ కేబినెట్‌లో ప్రధానితో సహా 10మంది మహిళలు

ట్యునీసియా దేశపు కేబినెట్ లో 10మంది మహిళలు కొలువుతీరారు. ప్రధానితో సహా 10మంది మహిళలు చోటు దక్కించుకున్నారు.

Tunisia new government includes record 10 women: ఆఫ్రికా దేశాల్లో ఒకటి ట్యునీసియా. ఈ దేశం అతివలకు అందలం ఎక్కించిన దేశంగా పేరొందింది.ఎందుకంటే ట్యునీసియా దేశపు కేబినెట్ లో 10మంది మహిళలు కొలువుతీరారు.ప్రధానితో సహా 10మంది మహిళలు చోటు దక్కించుకున్నారు. అభివృద్ధిలో దూసుకుపోతున్నామని చెప్పుకునే ఏదేశంలోను లేనంతగా ఒక ఆఫ్రికా దేశమైన ట్యునీసియా కేబినెట్ లో ప్రధానితో సహా 10మంది మహిళలు స్థానం దక్కించుకున్నారు.

Read more : ‘Cordyceps sinensis’ : హిమాలయాల్లో పెరిగే ఈ ఫంగస్‌తో క్యాన్సర్‌కు మెడిసిన్ : ఆక్స్‌ఫర్డ్ పరిశోధకుల వెల్లడి

ట్యునీసియా దేశానికి ప్రథమ మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బౌడెన్‌ 24 మంత్రులతో కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. వీరిలో ప్రధానితో కలిపి అత్యధిక సంఖ్యలో 10 మంది మహిళలే ఉండటం గమనించాల్సిన విషయం. అవినీతిపై పోరాటమే తమ లక్ష్యమని సోమవారం (అక్టోబర్ 11,2021) జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని బౌడెన్‌ ప్రకటించారు.

ట్యునీసియా అధ్యక్షుడు కైస్‌ సయీద్‌ దాదాపు రెండు నెలల క్రితం అప్పటి కేబినెట్‌ను బర్తరఫ్‌ చేసి, సర్వాధికారాలను చేజిక్కించుకున్నారు. సెప్టెంబర్‌ 29వ తేదీన ఆయన ప్రధాని పదవికి నజ్లా బౌడెన్‌ పేరును ప్రతిపాదించారు. తాజాగా, దేశానికి ప్రథమ మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బౌడెన్‌ 24 మంత్రులతో కేబినెట్‌ను ఏర్పాటు చేయగా వీరిలో ప్రధానితో కలిపి 10 మంది మహిళలే కావటం ఆహ్వానించాల్సిన విషయం. వీరిలో న్యాయ మంత్రిత్వ శాఖలో లీలా జాఫెల్,ఆర్థిక మంత్రిగా సిహెమ్ బౌగ్దిరి నెమ్సేయా ఉన్నారు.

Read more : Rajasthan Child marriage : బాల్య వివాహాల రిజిస్ట్రేషన్‌ చట్టంపై వెనక్కి తగ్గిన రాజస్థాన్‌ ప్రభుత్వం

ట్రెండింగ్ వార్తలు