‘Cordyceps sinensis’ : హిమాలయాల్లో పెరిగే ఈ ఫంగస్‌తో క్యాన్సర్‌కు మెడిసిన్ : ఆక్స్‌ఫర్డ్ పరిశోధకుల వెల్లడి

హిమాలయాల్లో పెరిగే ఓ రకమైన ఫంగస్ తో క్యాన్సర్ కు మందు కనిపెట్టారు పరిశోధకులు. ఆక్స్ ఫర్ట్ యూనివర్శిటీ పరిశోధకలు చేసిన మొదటిదశలో ఇవి సానుకూలఫలితాలు సానుకూలంగా వచ్చాయి.

‘Cordyceps sinensis’ : హిమాలయాల్లో పెరిగే ఈ ఫంగస్‌తో క్యాన్సర్‌కు మెడిసిన్ : ఆక్స్‌ఫర్డ్ పరిశోధకుల వెల్లడి

Funus For Cancer Medicine ‘cordyceps Sinensis’ (1)

Funus For Cancer Medicine ‘Cordyceps sinensis’ : క్యాన్సర్ మహమ్మారికి ఎంతోమంది బలైపోతున్నారు. దీనిని ముందుగా గుర్తిస్తే ప్రాణాలతో బయటపడొచ్చు. క్యాన్సర్ ముదిరితే దానికి పూర్తి చికిత్స రాలేదనే చెప్పాలి.ఈ క్రమంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు గుడ్ న్యూస్ చెప్పారు. హిమాలయాల్లో పెరిగే ఓ రకమైన ఫంగస్ తో క్యాన్సర్‌కు చికిత్స చేయవచ్చని తెలిపారు. ఈ ఫంగస్‌ లో క్యాన్సర్ కణాలను ఆపగల సామర్ధ్యాన్ని కలిగి ఉందని పరిశోధకులు తెలిపారు. ఈ ఫంగస్ ని శాస్త్రీయంగా ‘కార్డిసెప్స్ సైనెన్సిస్’అంటారని తెలిపారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ..బయోఫార్మా కంపెనీ న్యూకానా సంయుక్తంగా చేసిన పరిశోధనల్లో ఇది రుజువైంది. ఇది గొంగళిపురుగులాగా ఉంటుంది. దీంతో దీన్ని గొంగళిపురుగు ఫంగస్ అని అంటున్నారు.

‘కార్డిసెప్స్ సైనెన్సిస్’ (Cordyceps sinensis) అనే ఫంగస్ హిమాలయాల ప్రాంతాలైన నేపాల్, భూటాన్ దేశాల్లో కనిపిస్తుంది. ఈ ఫంగస్ చైనీయులు వందల సంవత్సరాలుగా ఔషధ తయారీలో ఉపయోగిస్తున్నారు. దీన్నే గొంగళి పురుగు ఫంగస్ అని కూడా అంటారు. ఈ ఫంగస్ లో కార్డిప్సిన్, అడెనోసిన్ రసాయనాలుఉంటాయట. కోడిసెప్సిన్ ఈ ఫంగస్ అతి పెద్ద లక్షణం.

Read more : World Rose Day 2021: ప్రపంచ గులాబీ దినోత్సవం వెనుక ఉన్న చరిత్ర..

ఇది క్యాన్సర్‌ను ఎలా నయం చేస్తుంది?
ఈ ఫంగస్ నుండి..సైంటిస్టులు కెమోథెరపీ మెడిసిన్ గా ఉపయోగించే ఔషధాన్ని అభివృద్ధి చేశారు. దీనికి NUC-7738 అని పేరు పెట్టారు. ఇది క్యాన్సర్ నిరోధక ఔషధం అని..క్యాన్సర్‌ కణాలను నిరోధించటంలో సహాయపడుతుందని తెలిపారు. క్యాన్సర్ కణాలపై ఇది 40 శాతం వరకు ప్రభావవంతంగా పనిచేస్తుందని పరిశోధకులు వెల్లడించారు.

ఎలాపనిచేస్తుందంటే..
ఈ ఫంగస్‌లో కనిపించే కార్డిప్సిన్ అనే రసాయనం శరీరానికి చేరి రక్తంలో కరగడం ప్రారంభమవుతుంది. ఇది ADA అనే ​ఎంజైమ్ సహాయంతో విచ్ఛిన్నమవుతుంది. ఆ తరువాత..ఇది క్యాన్సర్ కణాలను చేరుకుని వాటిపై ప్రభావం చూపుతుందని..ఈ విషయం క్లినికల్ ట్రయల్స్‌ ప్రారంభంలోనే రుజువైందని తెలిపారు. అంతేకాకుండా..NUC-7738 యొక్క మొదటి ఇన్-హ్యూమన్ క్లినికల్ ట్రయల్ నుండి ప్రారంభ ఫలితాలు ఇప్పటివరకు కూడా సానుకూలంగా కనిపిస్తున్నాయి.

Read more : Inspiration Man Jayant Kandoi : ఆరుసార్లు క్యాన్సర్ ను జయించిన 23 ఏళ్ల యువకుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..

క్లినికల్ క్యాన్సర్ రీసెర్చ్ జర్నల్‌లో ప్రచురించబడిన మొదటి దశ ట్రయల్ విజయవంతమైన అధ్యయనం ప్రకారం, ఫార్మా కంపెనీ న్యూకానా ఈ ఔషధాన్ని NUC-7738 పేరుతో ఉపయోగిస్తోంది. క్లినికల్ ట్రయల్ ఫేజ్ -1 ఫలితాలు ప్రభావవంతంగా ఉన్నాయి. క్లినికల్ ట్రయల్ యొక్క ఫేజ్ -2 కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలో తదుపరి దశ ట్రయల్స్ పెద్ద ఎత్తున జరగనున్నాయి. ఇలా అన్ని దశలు పూర్తి అయ్యాక ఈ మెడిసిన్ అందుబాటులోకి కావటానికి కాస్త సమయం పట్టనుంది.ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ప్రకారం, దేశంలో 13.9 లక్షల మంది క్యాన్సర్ రోగులు ఉన్నారు. 2025 నాటికి క్యాన్సర్ బాధితుల సంఖ్య 15.7 లక్షలకు పెరగనుందని అంచనా.

Read more : Inspiration Man Jayant Kandoi : ఆరుసార్లు క్యాన్సర్ ను జయించిన 23 ఏళ్ల యువకుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..