Inspiration Man Jayant Kandoi : ఆరుసార్లు క్యాన్సర్ ను జయించిన 23 ఏళ్ల యువకుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..

క్యాన్సర్ సోకితేనే తట్టుకుని జీవించటం చాలా కష్టం. అటువంటిది ఓ యువకుడు ఆరుసార్లు క్యాన్సర్ బారినపడి తట్డుకుని కోలుకున్నాడు. క్యాన్సర్ రోగులకు స్ఫూర్తినిస్తున్నాడు.

Inspiration Man Jayant Kandoi : ఆరుసార్లు క్యాన్సర్ ను జయించిన 23 ఏళ్ల యువకుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..

23 Yeas Jayanth Six Times Cancer

Jayant Kandoi got cancer 6 times one after he never gave up : క్యాన్సర్ మహమ్మారి ఒక్కసారి మనిషికి సోకితేనే తట్టుకుని జీవించటం చాలా కష్టం. అటువంటిది ఓ యువకుడికి ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా ఆరుసార్లు క్యాన్సర్ బారినపడ్డాడు.ఆరుసార్లు కూడా ఆ మహ్మమారిని జయించాడు. క్యాన్సర్ ను పోరాడటానికి అతని వయస్సులో సగం సరిపోయింది అంటే ఆ యువకుడు ఎలా ఉన్నాడు? ఎలా తట్టుకున్నాడో తెలిస్తే నిజంగా ఆశ్చర్యమనిపిస్తుంది. సాధారణంగా క్యాన్సర్ పేరు చెబితేనే ప్రాణంలు హడలిపోతాయి. అటువంటి ఒకసారికాదు ఆరుసార్లు క్యాన్సర్ బారిని పడటం దాన్ని జయించి కోలుకోవటం అంటే మాటలు కాదు. అలా ఆరుసార్లు క్యాన్సర్ ను జయించి క్యాన్సర్ రోగులకే కాదు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు రాజస్థాన్ లోని అజ్మేర్ జిల్లాకు చెందిన 23 ఏళ్ల యువకుడు జయంత్ కందోయి.

అంతేకాదు క్యాన్సర్ ను జయించటమే కాదు..డాన్సింగ్, సింగింగ్, యాక్టింగ్‌లో కూడా ప్రతిభ చూపుతు..జిల్లా స్థాయిలో ఖోఖో చాంపియన్‌గా కూడా నిలిచాడు. దాదాపు 23 ఏళ్ల జయంత్ జీవితం క్యాన్సర్ ని జయించటానికే సరిపోయింది. అయినా డాన్సింగ్ లోను,సింగింగ్ లోను తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవటమే కాకుండా ఖోఖో చాంపియన్‌గా నిలవటం అంటే మనోస్థైర్యానికి మారుపేరు జయంత్ అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.23 ఏళ్ల జయంత్ రాజస్థాన్ లోని అజ్మేర్ జిల్లాకు చెందిన యువకుడు. భారత్ లోనే ఆరుసార్లు క్యాన్సర్‌ను జయించిన వ్యక్తిగా జయంత్ నిలిచాడు. జయంత్ కు చిన్నప్పటి నుంచి చదువుపై అంటే చాలా ఇష్టం. స్కూల్లో టాపర్‌. ఎప్పుడు స్కూల్ మానేవాడు కాదు. స్కూల్ కు వెళ్లటమంటే అంత ఇష్టం జయంత్ కు. అలా జయంత్ స్కూల్లో ఫుల్ అటెండెన్స్ ఉండేది.

Read more :  World Rose Day 2021: ప్రపంచ గులాబీ దినోత్సవం వెనుక ఉన్న చరిత్ర..
డాన్సింగ్, సింగింగ్, యాక్టింగ్‌లో కూడా మంచి ప్రతిభ చూపే జయంత్‌ 2013లో తొలిసారిగా క్యాన్సర్ బారిన పడటంతో అతని అన్ని హాబీలకు బ్రేక్ పడింది. అప్పటికి జయంత్ 10th క్లాస్ లో ఉన్నాడు. క్యాన్సర్ వల్ల అతని గొంతు కుడి వైపున హాడ్కిన్ లింఫోమా ఏర్పడింది. దీంతో తల్లిదండ్రులు హడలిపోయాడు. చదువుల్లోనే కాకుండా ఆటలు,పాటల్లో దూసుకుపోతున్న తమ కొడుక్కి క్యాన్సర్ అని తెలిసి కుమిలిపోయారు. ఎలాగైనా కొడుకుని కాపాడుకోవటానికి భగవాన్ మహావీర్ క్యాన్సర్ ఆసుపత్రిలోజాయిన్ చేసి చికిత్స చేయించారు. జయంత్‌కు 12 సార్లు కీమోథెరపీ చేయించుకోవాల్సి వచ్చింది. అలా క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటునే జయంత్ 10th బోర్డ్ ఎగ్జామ్స్ కు చదువుకుంటు పరీక్షలు రాశాడు.ఓ పక్క క్యాన్సర్ తో పోరాడుతునే చదువుకుని 10thలో స్కూల్ టాపర్ గా నిలిచాడు. అతని పరిస్థితి తెలిసిన టీచర్లు,తోటి విద్యార్ధులు కూడా క్యాన్సర్ బారిని పడి కూడా టాపర్ గా నివటంతో ఆశ్చర్యపోయారు. నిజంగా స్ఫూర్తి నిచ్చే పిల్లాడు జయంత్ అని ప్రశంసించారు. అలా చదువులో ఫస్ట్ వచ్చిన జయంత క్యాన్సర్‌ను కూడా జయించాడు. చికిత్స తరువాత పలు సమస్యలు వచ్చినా తట్టుకున్నాడు. తరువాత ఆరోగ్యం కుదుటపడింది.

Read more : World Rose Day: క్యాన్సర్ బారినపడిన ప్రముఖులు చెప్పిన అద్భుతమైన మాటలు

కానీ క్యాన్సర్ జయంత్ ను వదల్లేదు. వదలబొమ్మాళీ అంటూ మరోసారి క్యాన్సర్ జయంత్‌పై దాడి చేసింది. అలా 2015 ఫిబ్రవరిలో జయంత్ మరోసారి గొంతు క్యాన్సర్‌ ఎటాక్ చేసింది. దీంతో జయంత్ రేడియోథెరపీని చేయించుకోవాల్సి వచ్చింది. ఈ సమయంలో జయంత్ 60 రేడియోథెరపీ సెషన్లను తీసుకోవాల్సిన పరిస్థితి. అలాగే తీసుకున్నాడు. తట్టుకున్నాడు. అదికూడా తగ్గింది అని ఊపిరి తీసుకునేంతలో మరోరూపంలో క్యాన్సర్ దాడి చేసింది. అప్పటికిజయంత్ ఢిల్లీ వెళ్లాడు బీ. కామ్ చదువుకోవటానికి.2017లో జయంత్ కడుపు నొప్పిగా ఉందని చెప్పటంతో హాస్పిటల్ కు వెళ్లగా పరీక్షలు చేసిన డాక్టర్ ‘ఉదర సంబంధిత క్యాన్సర్’ అని చెప్పారు. అలా మరోసారి క్యాన్సర్ బారిని పడ్డాడు జయంత్. దీంతో అతనికి ఎంతో ఇష్టమైన చదువు ఆగిపోయింది. అప్పటికే జయంత్ ఓ స్టార్టప్ ప్రారంభించగా అదికూడా ఆగిపోయింది. అలా రెండేళ్లు చికిత్స కొనసాగింది. ఆ తరువాత కూడా 2019 ప్రారంభంలో కూడా అదే పరిస్థితి. 2019 చివరిలో మరోసారి క్యాన్సర్ బారిన పడ్డాడు. 2020 నవంబరులో జయంత్‌కు ఆరవసారి క్యాన్సర్ సోకింది. ఈ సమయంలో అతనికి బోన్‌మ్యారో (మజ్జ మార్పిడి) ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సివచ్చింది. అలా క్యాన్సర్ తో పోరాడుతు..లక్షల రూపాయల ఖర్చు.

Read more : కేన్సర్ డే : గుర్తిద్దాం..జయిద్దాం

జయంత్ క్యాన్సర్‌ను ఎదుర్కొన్న సమయంలో అతని తల్లిదండ్రులు అతనికి అండగా ఉంటూ కొండంత ధైర్యాన్ని నింపారు. ఆరుసార్లు క్యాన్సర్ ఓడించిన జయంత్ ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్‌గా మారారు. తన స్నేహితుల సహాయంతో సిటీ స్టార్ట్ అనే క్లబ్ ను ప్రారంభించాడు జయంత్.దీని ద్వారా జయంత్ క్యాన్సర్ రోగులకు సహాయం చేస్తారు.వారిలో ధైర్యాన్ని నింపుతారు. చికిత్సతో నయం అవుతుందని ధైర్యాన్నికలిగిస్తారు.అలా ఆరుసార్లు క్యాన్సర్ ను జయించిన జయంత్ మాట్లాడుతూ..క్యాన్సర్‌ను చాలా పెద్ద వ్యాధిగా భావిస్తున్నారు. క్యాన్సర్ సోకితే ఇక చావే అన్నట్లుగా భయపడుతున్నారు. ఇది ఎంతమాత్రం సరికాదు. క్యాన్సర్ కు చక్కటిచికిత్సలు అందుబాటులోకి వచ్చాయి.క్యాన్సర్ సోకినవారు ఆందోళనకు గురికావద్దు. ఎవ్వరు కూడా వారిని కంగారుపెట్టటం.భయపెట్టటం చేయవద్దు. చికిత్స చేయించుకుంటే కొంత సమయం తర్వాత నయమవుతుంది. క్యాన్సర్‌తో పోరాడితే తప్పకుండా దాన్ని క్యాన్సర్‌ను తరిమికొట్టవచ్చని జయంత్ చెబుతున్నాడు.

జయంత్ 2018లో జ్ఞాన్ కీ బాత్ అనే యాప్ ప్రారంభించారు. దీనిని ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. త్వరలో జయంత్ స్థానిక దుకాణదారుల కోసం ఒక యాప్‌ను కూడా ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం జయంత్ మోటివేషనల్ స్పీకర్‌గా ఉంటూనే ఎంబీఏ చదువుతున్నారు. భవిష్యత్‌లో జయంత్… క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేసి, దానిలో క్యాన్సర్ బాధితులకు ఉచితంగా చికిత్స అందించాలని ఆకాంక్షిస్తున్నాడు. మరి ఆరుసార్లు క్యాన్సర్ ను జయించటమే కాకుండా క్యాన్సర్ రోగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్న జయంత్ కు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

క్యాన్సర్ తనకు ఎన్నో పాఠాలు, గుణపాఠాలు నేర్పించదంటాడు జయంత్. గతంలోనేను చాలా కోపిష్టివాడిని. కానీ క్యాన్సర్ తరువాత నాలో చాలా మార్పు వచ్చింది. జీవితాన్ని మరోకోణం నుంచి చూసేలా చేసింది క్యాన్సర్ అని తెలిపాడు. ప్రజలకు..సాటి క్యాన్సర్ రోగులకు నేను ఎలా సహాయపడగలనుఅని ఆలోచిస్తున్నారు. అలా నా ఆలోచనల్ని పుస్తక రూపంలో పొందుపరిచాను.ఆ పుస్తకాన్ని త్వరలో విడుదల చేస్తానని తెలిపాడు.