World Rose Day: క్యాన్సర్ బారినపడిన ప్రముఖులు చెప్పిన అద్భుతమైన మాటలు

క్యాన్సర్ బారినపడిన ప్రముఖులు చెప్పిన అద్భుతమైన మాటలు ఎంతోమంది క్యాన్సర్ బాధితులకు స్ఫూర్తిదాయకం.

World Rose Day: క్యాన్సర్ బారినపడిన ప్రముఖులు చెప్పిన అద్భుతమైన మాటలు

Worl Rose Day 2021

World Rose Day: క్యాన్సర్ మహమ్మారికి ప్రతీ ఏటా వేలాదిమంది బలైపోతున్నారు. కానీ వైద్య రంగంలో వస్తున్న అత్యద్భుతమైన మార్పులతో..అందుబాటులోకి వచ్చిన చికిత్సలతో క్యాన్సర్‌ని మొదటి దశలో గుర్తించి బయట పడే అవకాశాలుంటున్నాయి. కానీ ఎంత వైద్యం అందుబాటులోకి వచ్చినా..ఈ మహమ్మారిని జయించటం..అంటే మాటలు కాదు. మెరుగైన వైద్యంతో పాటు మనోధైర్యం చాలా ముఖ్యం. క్యాన్సర్ సోకింది అంటే మానసికంగా కృంగిపోయేవారే ఎక్కువ. కానీ క్యాన్సర్ సోకినా ఎంతోమంది దాన్ని తట్టుకుని..శారీరకంగా..మానసికంగా పోరాడుతున్నారు.

సాటి రోగులకు ధైర్యాన్ని చెబుతున్నారు. రోగికి మందుల కంటే మానసకి ధైర్యమే ఎక్కువ అనే విషయాన్ని గుర్తించిన ఎంతోమంది క్యాన్సర్ బారినపడివారికి చక్కటి ధైర్యాన్నిస్తున్నారు. వారు క్యాన్సర్ తో పోరాడుతునే..అటువంటి కొంతమంది క్యాన్సర్ బారిన పడిన ప్రముఖులు చెప్పే మాటలు స్ఫూర్తినిస్తున్నాయి.

Read more : World Rose Day 2021: ప్రపంచ గులాబీ దినోత్సవం వెనుక ఉన్న చరిత్ర..

స్టీవ్ జాబ్స్ ..
స్మార్ట్‌ఫోన్ రంగంలో బ్రాండ్ ఇమేజ్ యాపిల్. ఎన్ని స్మార్ట్స్ వచ్చినా యాపిల్ స్టైల్..ఆ బ్రాండే వేరు. అటువంటి యాపిల్ కంపెనీ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ కూడా క్యాన్సర్ బారినపడ్డారు. క్యాన్సర్ బారిన పడిన ఆయన 2011లో అక్టోబర్ 5న మరణించారు. కానీ క్యాన్సర్ బారిన పడ్డానని ఆయన ఎప్పుడు ఆయన మనోధైర్యాన్ని కోల్పోలేదు. ఆ సమయంలో ఆయన అన్న మాటలు క్యాన్సర్ రోగులకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు.

స్టీవ్ జాబ్స్ మాట్లాడుతు..‘‘మీరు ఏదో కోల్పోతున్నాను అనుకునే కంటే మీరు చనిపోతున్నారు అనే విషయాన్ని గుర్తించుకోవటమే ఉత్తమమైన మార్గం. ఈ సమయం మీ మనస్సుకు దగ్గరగా ఉండి నచ్చినవి చేసి ఆనందంగా గడిపే క్షణాలుగా భావించండి. ఎందుకంటే జీవించి ఉన్నప్పేడే చేయాలని ఏం చేసినా..అని చెప్పారు స్టీవ్‌ జాబ్స్‌.

Read more :  క్యాన్సర్ ను జయించి : ముంబైకి చేరుకున్న రిషీ కపూర్

జోయెల్‌ సీగెల్‌
జోయెల్ సీగెల్. అమెరికాకు చెందిన ప్రముఖ చిత్ర విమర్శకుడు, జర్నలిస్టు కూడా. జోయెల్ సీగెల్ కొలొరెక్టల్ క్యాన్సర్ బారిన పడి మరణించారు. క్యాన్సర్ బారిన పడిన ఆయన ‘‘క్యాన్సర్‌ మీ జీవితాన్ని మారుస్తుంది. మీరు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. మీరు ద్వేషించిన వాళ్లను, ప్రేమించిన వాళ్ల పట్ల కనబర్చిన ప్రతీది మీకు గుర్తుకు రావడమే కాక ఏం చేసుంటే బాగుండేది అనేది కూడా తెలుస్తుంది. అంతేకాదు సమయాన్ని వృధా చేయరు. మీకు ఇష్టమైన వ్యక్తులతో ప్రేమిస్తున్నానే విషయాన్ని చెప్పడానికి కూడా వెనుకడుగు వేయరు అని అని అన్నారు. అంటే ప్రాణాంతక వ్యాధి వల్ల జీవితంలో ఎన్నో తెలుస్తాయని..సమయం విలువ ఏంటో తెలుస్తుంది అని జోయెల్‌ సీగెల్‌ అభిప్రాయపడ్డారు.

మీకు ఏదైనా నచ్చకపోతే దాన్ని మార్చండి. ఒకవేళ దానిని మార్చలేనిదైత మీరే మీ వైఖరిని మార్చుకోండి.- మాయ ఏంజెలో

Read more : Tollywood : క్యాన్సర్‌‌తో పోరాడుతున్న అభిమానితో మాట్లాడిన ప్రభాస్
ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్..
ఇండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ ఓ చరిత్ర. ఓ రికార్డు. క్రికెట్ అంటే ప్రాణం. అటువంటి యువరాజ్ క్యాన్సర్ బారిన పడ్డారు. చికిత్స పొంది కోలుకున్నాక కూడా క్రికెట్ ఆడి పలు రికార్డులు నెలకొల్పారు. క్యాన్సర్ బారిన పడిన యువరాజ్ ‘‘క్రికెటే నాజీవితం. క్యాన్సర్‌కు ముందు నేను సంతోషంగా ఉండేవాడిని. ఎప్పుడైతే ఈ వ్యాధి భారినపడ్డానో అప్పుడే నాలో ఆందోళన, భయం మొదలైయ్యాయి. నాలా బాధపడుతున్న వాళ్లని చూసినప్పుడు దీన్ని ఏ విధంగానైనా ఎదిరించి జీవిచడమే కాక తనలా బాధపడేవాళ్లకు తన వంతు సాయం చేయాలనే తపన మొదలైంది. మళ్లీ నా జీవితం నాకు తిరిగి లభించినందుకు సంతోషంగా ఉంది’

– క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌
ఇలా ఎంతోమంది ప్రముఖులు క్యాన్సర్ బారిన పడి కోలుకుని తిరిగి వారి జీవితాలను కొనసాగిస్తున్నారు.బాలివుడ్ హీరోయిన సోనాలి బింద్రే. నటి గౌతమి, సింగర్ మమతా మోహన్ దాస్.అక్కినేని నాగేశ్వరరావు, మనీషా కొయిరాలా. ఇలా ఎంతోమంది క్యాన్సర్ బారిన పడి చికిత్స్ చేయించుకుని వారి జీవితాలను కొనసాగిస్తున్నారు.వీరంతా మనోస్థైర్యంతో జీవిస్తున్నారు.