కేన్సర్ డే : గుర్తిద్దాం..జయిద్దాం

  • Published By: madhu ,Published On : February 4, 2019 / 02:34 AM IST
కేన్సర్ డే : గుర్తిద్దాం..జయిద్దాం

హైదరాబాద్ :  ఫిబ్రవరి 04వ తేదీ…కేన్సర్ డే..ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమౌతున్న ముఖ్యరోగాల్లో కేన్సర్ ఒకటి. ప్రముఖుల నుండి సామాన్యుల వరకు దీని బారిన పడుతున్నారు. అందులో కొంతమంది కేన్సర్‌ని జయిస్తున్నారు. మద్యపానం, ధూమపానం, గుట్కా, పాన్ మసాలాలు..సేవించడం..కొన్ని కారణాల వల్ల కేన్సర్ వస్తుంది. గర్భాశయ ముఖద్వార కేన్సర్లతో, రొమ్ము కేన్సర్‌లు మహిళలు బాధ పడుతుంటారు. ఈ కారణంగా ఎంతో మంది మృత్యువాత పడున్నారు. కేన్సర్‌పై అవగాహన మొదట పెంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దేశంలో ఏటా 7 లక్షల మంది మరణిస్తున్నట్లు అంచనా. 
 

  • దగ్గు అప్పుడప్పుడూ వస్తుండడం..అంతకు మించి ఏకధాటిగా దగ్గు వస్తే…ఊపిరితిత్తుల కేన్సర్‌కి సంబంధించింది. 
  • పేగుల కదలికలు సులభంగా ఉండకపోవడం…డయేరియా..మలబద్దకం వంటివి జీర్ణాశయ కేన్సర్ లక్షణాలుగా పరిగణించాల్సి ఉంటుంది. తప్పనిసరిగా ఎండోస్కోపీ / కొలనోస్కోపీ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.
  • మూత్రం చేసే సమయంలో ఇబ్బందులు రావడం..రక్తం పడడం నొప్పి వంటివి కలుగుతుంటాయి. కిడ్నీ, బ్లాడర్, ప్రొస్టేట్ కేన్సర్ లక్షణాలు కావచ్చు. 
  • గాయం తగిలిన తరువాత పుండ్లుగా ఏర్పడి..3 వారాలు దాటినా మానకపోతే…ఈ పుండ్లు కేన్సర్‌గా మారే అవకాశం ఉంది. 
  • పుట్టుమచ్చల వంటివి కనిపించడం…పుట్టుమచ్చలు రూపు మారడం స్కిన్ కేన్సర్‌గా చెప్పవచ్చు. 
  • బరువు తగ్గిపోతే ప్రమాదమే. కణితి లేదా కేన్సర్ వల్ల కావచ్చు. రొమ్ములలో గడ్డలు రొమ్మ కేన్సర్ లక్షణాలుగా చెప్పవచ్చు. తరచూ అజీర్ణం, మింగడంలో ఇబ్బంది, మింగుతున్న సమయంలో కలగడం అనేది మెడ అన్నవాహిక కేన్సర్ లక్షణాలు.
  • మహిళల సాధారణ రుతుచక్ర సమయంలో రక్తస్రావం కావడం గర్భాశయ ముఖద్వార..గర్భశాయ కేన్సర్‌కి లక్షణాలు.