Operation Sindoor: భారత్‌పై దాడికి టర్కీ పెద్ద ప్లానే వేసింది..! డ్రోన్లతోపాటు సైనికులు కూడా వచ్చారు.. వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు

పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ కు మద్దతుగా టర్కీ నిలిచింది.. అయితే, తాజాగా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

Turkey sent drones and military operatives to Pakistan

Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇరుదేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. ఈ తరుణంలో టర్కీ (ప్రస్తుతం తుర్కియే) పాకిస్థాన్ కు మద్దతుగా నిలిచింది. పహల్గాం ఉగ్రదాడిని ఖండించకపోగా.. భారత్ పై దాడులకు తెగబడిన పాకిస్థాన్ కు టర్కీ ఆయుధ సహకారం అందించింది. టర్కీ నుంచి పెద్దె సంఖ్యలో డ్రోన్లు పాకిస్థాన్ కు తరలించింది. అయితే, తాజాగా విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. డ్రోన్ల సాయమే కాకుండా పాకిస్థాన్ కు టర్కీ నుంచి సైనిక సిబ్బంది కూడా వచ్చినట్లు తెలుస్తోంది.

Also Read: పాక్‌కు మరో షాక్… మోదీ మాటల వెనుక అర్ధం ఇదేనా?

పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ ఆర్మీ ‘ఆపరేషన్ సిందూ’ పేరుతో పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 100మందికిపైగా ఉగ్రవాదులు మరణించినట్లు భారత ఆర్మీ పేర్కొంది. ఈ ఘటన తరువాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్దవాతావరణం నెలకొంది. పాకిస్థాన్- టర్కీ ల మధ్య వ్యూహాత్మక రక్షణ సంబంధాల ఇటీవల భారీగా పెరిగాయి. దీంతో భారత్ పై పాకిస్థాన్ దాడులు మరింత ఉధృతం చేసేందుకు టర్కీ నుంచి వందల డ్రోన్లు పాకిస్థాన్ కు అందాయి. దీంతో పాకిస్థాన్ భారీ స్థాయిలో భారత్ పై డ్రోన్ దాడులు చేసింది. దాదాపు 300 నుంచి 400 డ్రోన్లను ప్రయోగించింది. వాటిని భారత వైమానిక రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాక్ నుంచి వచ్చిన డ్రోన్లను గాల్లోనే పేల్చేసింది. భారత్ లోని పలు సరిహద్దు ప్రాంతాల్లో పాక్ నుంచి వచ్చిన డ్రోన్లు కూలిపోయాయి.

Also Read: పాక్ బుద్ధి మరోసారి బయటపడింది.. ఆపరేషన్ ‘బున్యానుమ్ మార్సూస్’ పై పాక్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ ఏమన్నాడంటే..

డ్రోన్ శకలాలను ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షించారు. అవన్నీ టర్కీకి చెందిన అసిస్ గార్డ్ సోనగర్ డ్రోన్లుగా ధ్రువీకరించారు. తాజాగా మరో విస్తుగొలిపే విషయం వెలుగులోకి వచ్చింది. డ్రోన్ల సాయమే కాకుండా పాకిస్థాన్ కు టర్కీ తమ సైనిక సిబ్బందిని కూడా పంపించినట్లు వార్తలు వచ్చాయి. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత్ చేపట్టిన దాడుల్లో చనిపోయిన వారిలో ఇద్దరు టర్కీ సైనికులు ఉన్నట్లు తెలుస్తోంది.