×
Ad

Turkish Plane Crash: కుప్పకూలిన విమానం.. టేకాఫ్ అయిన కాసేపటికే క్రాష్.. వీడియో వైరల్..

ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయంది. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

Turkish Plane Crash: తుర్కియేలో విమాన ప్రమాదం జరిగింది. ఓ విమానం కుప్పకూలింది. టేకాఫ్ అయిన కాసేపటికే క్రాష్ అయ్యింది. విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తుర్కియేకి చెందిన మిలిటరీ కార్గో ప్లేన్ క్రాష్ అయ్యింది. సీ-130 ఎయిర్ క్రాఫ్ట్ అజర్ బైజాన్ నుంచి తుర్కియేకి వెళ్లేందుకు టేకాఫ్ అయ్యింది. ఆ కాసేపటికే ప్రమాదానికి గురైంది. గాల్లోకి లేచిన కొంతసేపటికే ప్లేన్ నేల కూలింది. అజర్ బైజాన్-జార్జియా దేశాల బోర్డర్ లో ఈ ప్రమాదం జరిగింది. విమానం రెక్కల నుంచి పొగలు వచ్చాయి. గాల్లో తిరుగుతూ కుప్పకూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ పై తుర్కియే రక్షణ శాఖ ప్రకటన చేసింది. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయంది. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అజర్ బైజాన్, జార్జియాకు చెందిన బృందాలు కలిసి గాలింపు చర్యల్లో పాల్గొన్నాయి.

సాధారణంగా C-130 విమానాలను టర్కీ సాయుధ దళాలు వాడతాయి. దళాలు, సామగ్రి రవాణకు ఉపయోగిస్తాయి. టర్కీ, అజర్‌బైజాన్ మధ్య సైనిక సంబంధాలు ఉన్నాయి. విమాన ప్రమాదంపై తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Also Read: సుంకాలపై భారత్‌కు ట్రంప్ గుడ్ న్యూస్..! త్వరలోనే..