Twitter Rules: ట్విట్టర్ రూల్స్ మార్చేశారు.. ఆ పోస్టులకు చెక్

ప్రముఖ సోషల్ మీడియా ట్విట్టర్ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇకపై ఇతరుల వీడియోలను, ఫొటోలను తమ ఖాతాల్లో పోస్టు చేయడం లేదా షేర్ చేయడం పూర్తిగా నిషేదించింది.

Twitter Rules: ప్రముఖ సోషల్ మీడియా ట్విట్టర్ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇకపై ఇతరుల వీడియోలను, ఫొటోలను తమ ఖాతాల్లో పోస్టు చేయడం లేదా షేర్ చేయడం పూర్తిగా నిషేదించింది. ఒకవేళ పోస్టు చేయాలనుకుంటే.. వారి అనుమతి తప్పక తీసుకోవాల్సిందే. ప్రైవసీకి భంగం కలిగించకుండా ఉండటానికే ఈ నిర్ణయం తీసుకున్నారట.

ఫలితంగా అసభ్యకర ఫొటోలు, వీడియోలను నియంత్రణ జరుగుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. అమెరికాయేతర దేశాలను దృష్టిలో ఉంచుకునే కొత్త పాలసీని తీసుకొచ్చారట. అత్యాచార బాధితుల చిత్రాలు పోస్ట్‌ చేయడం, అఫ్ఘానిస్థాన్‌లో బుర్ఖా లేకుండా బయటికు వెళ్లిన ముస్లిం మహిళలు బహిరంగరంగా దాడికి గురికావడం వంటి చిత్రాలను ట్విటర్‌లో పోస్ట్‌ చేయడాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పింది.

వ్యక్తిగత సంభాషణలను స్ర్కీన్‌షాట్‌గా తీసి షేర్‌ చేయొచ్చని అలా చేసే సమయంలో వ్యక్తి ఫోన్‌ నంబర్లు, చిరునామాలు లేదా ఈ-మెయిల్ ఐడీ సమాచారం ఉండకుండా చూసుకోవాలని స్పష్టం చేసింది. ఇటువంటి పాలసీని పాటించకపోతే రూల్స్ బ్రేక్ చేసిన తీవ్రతతో పాటు ఎన్నిసార్లు అలా చేశారో లెక్కించి, దాని ఆధారంగా శాశ్వతంగా వారి అకౌంట్స్‌ను తీసేస్తామని ట్విటర్‌ హెచ్చరించింది.

………………………………………: వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన

అనుమతి లేకుండా ఎవరైనా ఫొటో, వీడియోని షేర్‌ చేస్తే ట్విటర్‌లో రిపోర్ట్‌ చేయొచ్చని దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పింది.

ట్రెండింగ్ వార్తలు