CM Jagan: వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు రెడీ అయ్యారు ఏపీ సీఎం జగన్‌.

CM Jagan: వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన

Jagan

CM Jagan: వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు రెడీ అయ్యారు ఏపీ సీఎం జగన్‌. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. కడప, చిత్తూరు జిల్లాల్లో పర్యటిస్తారు సీఎం జగన్‌. వరద బాధిత ప్రజలను, రైతులను కలిసి పరామర్శిస్తారు. వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. రేపు తిరుపతితో పాటు నెల్లూరు జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు సీఎం జగన్.

ఇవాళ ఉదయం 9.30గంటలకి గన్నవరం విమానాశ్రయం నుంచి కడప జిల్లాకు బయల్దేరనున్నారు. 10.50గంటలకి రాజంపేట చేరుకుంటారు. అక్కడ నుంచి పుల్లపొత్తూరు గ్రామానికి వెళ్లనున్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులతో మాట్లాడనున్నారు. అక్కడ నుంచి ఎగుమందపల్లి వెళ్లి వరద ప్రభావానికి దెబ్బతిన్న ప్రాంతాల్లో కాలినడకన పర్యటించనున్నారు జగన్‌.

ఇక మధ్యాహ్నం 2 గంటల15 నిమిషాలకు మందపల్లి చేరుకుని వరద నష్టం, అనంతర సహాయ చర్యలపై జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. సమీక్ష అనంతరం రేణిగుంట మండలం వేదలచెరువు, ఎస్టీ కాలనీలను పరిశీలిస్తారు. కాలనీ వాసులతో వరదనష్టంపై ముఖాముఖి నిర్వహించనున్నారు.

Delhi shocker : దేశ రాజధానిలో షాకింగ్ ఘటన.. మహిళలపై విచక్షణారహితంగా దాడి.. వీడియో

సాయంత్రం 4.30కి ఏర్పేడు మండలం, పాపనాయుడు పేట గ్రామానికి వెళ్లి వరద నష్టాన్ని జగన్‌ పలిశీలిస్తారు. అనంతరం తిరుపతి రూరల్‌ మండలం తిరుచానూరు, పాడిపేట క్రాస్‌కు వెళ్లి వరద బాధితులతో మాట్లాడతారు. సాయంత్రం 6 గంటలకు వరదనష్టం, సహాయ, పునరావాసచర్యలపై తిరుపతిలో అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారు. రాత్రి పద్మావతి అతిధి గృహంలోనే బసచేయనున్నారు సీఎం జగన్‌.