Benjamin Netanyahu: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇంటిపై బాబుల దాడి .. వీడియో వైరల్

నెతన్యాహు ఇంటిపై సమీపంలో బాంబు దాడి జరగడం ఇది రెండోసారి. గత నెలలో నెతన్యాహు ఇంటిపై డ్రోన్ దాడులు జరిగాయి.

Israeli PM Benjamin Netanyahu House

Israel PM Benjamin Netanyahu: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటిపై శనివారం బాంబుల దాడి జరిగింది. ఉత్తర ఇజ్రాయెల్ సిజేరియా పట్టణంలో ప్రధాని నివాసం ఉంది. ఆయన ఇంటిపై రెండు ఫ్లాష్ బాంబులతో దాడి చేయగా.. అవి ఇంటి తోటలో పేలినట్లు అధికారులు తెలిపారు. బాంబులు పేలిన సమయంలో నెతన్యాహు, ఆయన కుటుంబ సభ్యులు ఆ ప్రదేశంలో లేకపోవడంతో ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు.

Also Read: Elon Musk : అమెరికా టు భారత్.. కేవలం 30 నిమిషాల్లోనే ప్రయాణం.. ఎలన్‌ మస్క్‌ ఫ్యూచర్ ప్లానింగ్ అదిరింది..!

నెతన్యాహు ఇంటిపై సమీపంలో బాంబు దాడి జరగడం ఇది రెండోసారి. గత నెలలో నెతన్యాహు ఇంటిపై డ్రోన్ దాడులు జరిగాయి. సిజేరియాలోని ఆయన నివాసం లక్ష్యంగా ఈ డ్రోన్ దాడులు జరగ్గా.. ఆ సమయంలో ప్రధాని, ఆయన సతీమణి నివాసంలో లేరని ప్రభుత్వం తెలిపింది. తాజాగా.. మరోసారి ప్రధాని ఇంటిపై రెండు ఫ్లాష్ బాంబులతో దాడి చేయడాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తోంది. టెల్ అవీవ్ రక్షణ మంత్రి కాట్జ్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. హద్దులను దాటుతున్నారంటూ హెచ్చరించారు. ఈ దాడిపై న్యాయశాఖ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

 

ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ ‘ఎక్స్’ వేదికగా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. నేను ఇప్పుడే షిన్ బెట్ (ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఏజెన్సీ) అధిపతితో మాట్లాడాను. సంఘటనకు బాధ్యులైన వారిని గుర్తించేందుకు దర్యాప్తును వేగవంతం చేసి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశానని హెర్జోగో పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. ఇజ్రాయెల్ ప్రధాని ఇంటిపై రాకెట్ల దాడి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రెండు ఫ్లాష్ బాంబులు పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడం వీడియోలో చూడొచ్చు.

 

\