ఇండోనేషియా దేశంలోని బాలీ ఫ్రావిన్స్ లో రెండు తలల పాము కన్పించడంతో అందరూ షాక్ అయ్యారు. తబనాన్ ప్రాంతంలోని ఓ చిన్న గ్రామంలోని రోడ్లపై..చూడటానికి భయంకరంగా ఉండి రెండు తలలో తిరుగుతూ ఆ పాము అందరినీ హడలెత్తించింది. మొదటగా ఆ పామును చూసిన కొంతమంది చిన్నారులు పాము ఫొటోలు,వీడియోలు తీశారు. అయితే అంతలో ఓ వ్యక్తి పామును కర్రను ఉపయోగించి తిప్పడం చేశాడు.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక పెద్ద అరటి ఆకు మీద పాము ఉండటం, దాని చుట్టూ కొన్ని పసుపు పువ్వులు ఉండటం ఆ వీడియోలో చూడవచ్చు. ఈ రెండు తలల పాము వంటి అసాధారణ జీవులు దేవతల అవతారంగా భావించి కొందరు ప్రజలు తరచూ పూజిస్తారన్న విషయం తెలిసిందే. అయితే పాముకు రెండు తలలు ఉండటం తరచుగా బైస్ఫాలీ అనే జీవ ప్రక్రియ యొక్క ఫలితం. అప్పుడప్పుడు రెండు తలలతో పిల్లలు పుట్టడానికి కారణమయ్యే ఒక విషయం.