Japan : రెండు విమానాలు ఢీ..

అప్పటికే రెండు విమానాలు స్వల్పంగా ఢీకొనడంతో థాయ్ ఎయిర్ వేస్ విమానం రెక్క విరిగిపోయింది.

Two planes collided

Two Planes Collided : జపాన్ రాజధాని టోక్యో విమానాశ్రయంలో భారీ విమాన ప్రమాద తప్పింది. ఒకే రన్ వేపైకి వచ్చిన రెండు విమానాలు ప్రమాదవశాత్తు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరికీ గాయాలు కాలేదని అధికార వర్గాలు తెలిపాయి.

బ్యాంకాక్ కు వెళ్లే థాయ్ ఎయిర్ వేస్ విమానం, ఈవీఏ ఎయిర్ కు చెందిన మరో ప్రయాణికుల విమానం శనివారం టోక్యోలోని హనెడా విమానాశ్రయంలోని ఒకే రన్ వేపైకి వచ్చాయి. రెండు విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అయితే, పైలట్ లు అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

Karnataka : చిరుత దాడి నుంచి యజమానిని కాపాడిన ఆవు, శునకం

అప్పటికే రెండు విమానాలు స్వల్పంగా ఢీకొనడంతో థాయ్ ఎయిర్ వేస్ విమానం రెక్క విరిగిపోయింది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో పలు దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల రాకపోకలు ఆలస్యంగా సాగాయి.