Karnataka : చిరుత దాడి నుంచి యజమానిని కాపాడిన ఆవు, శునకం

అక్కడే ఉన్న కుక్క కూడా ఆవుతో కలవడంతో రెండూ కలిసి చిరుతపై పోరాడాయి. ఆవు కొమ్ముల దాడికి చిరుత గింగిరాలు తిరిగి పడి పోయింది.

Karnataka : చిరుత దాడి నుంచి యజమానిని కాపాడిన ఆవు, శునకం

Farmer

Updated On : June 11, 2023 / 7:17 AM IST

Cow And Dog Rescue Farmer : కర్ణాటకలో ఓ ఆవు, శుకనం.. చిరుత దాడి నుంచి తమ యజమానిని రక్షించాయి. తమ యజమాని ప్రాణాలు కాపాడటం కోసం ఆవు, కుక్క చిరుతతో తలపడ్డాయి. చిరుత పులిని తరమికొట్టాయి. తమకు అన్నం పెట్టిన రైతు ప్రాణాలు కాపాడి రుణం తీర్చుకున్నాయి.

కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో కరిహలప్ప(58) అనే రైతు తన ఆవును వెంట తీసుకుని పొలానికి వెళ్లాడు. ఈ నేపథ్యంలో పొదలో దాగి ఉన్న చిరుతపుల్లి అకస్మాత్తుగా కరిహలప్పపై దాడికి ప్రయత్నించింది. ఇది చూసిన ఆవు వెంటనే అక్కడకు వచ్చి తన కొమ్ములతో చిరుతపై దాడికి చేసింది.

అక్కడే ఉన్న కుక్క కూడా ఆవుతో కలవడంతో రెండూ కలిసి చిరుతపై పోరాడాయి. ఆవు కొమ్ముల దాడికి చిరుత గింగిరాలు తిరిగి పడి పోయింది. అదే సమయంలో కుక్క కూడా దాడికి దిగడంతో చిరుతపులి అక్కడి నుంచి పారిపోయింది. అయితే ఆవు, కుక్క సమయానికి రాకపోతే తన ప్రాణాలు దక్కేవి కాదంటూ కరిహలప్ప ఉద్వేగంతో చెప్పారు.