Terrorist Shooting in Belgium
Terrorist Shooting – Two Swedes Killed : బెల్జియంలో మరోసారి ఉగ్రభూతం జడలు విప్పింది. బ్రస్సెల్స్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జిహాదీ టెర్రరిస్టు కాల్పులకు తెగబడ్డాడు. ఏకే 47తో బైక్ పై వచ్చిన వచ్చిన ఉగ్రవాది ముస్లిముయేతరులే లక్ష్యంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు స్వీడన్ దేశస్థులు మృతి చెందారు. చాలా మంది గాయపడ్డారు. దాడికి ముందు ఆ ఉగ్రవాది ఏకే – 47 గన్ తో వీధుల్లో హల్ చల్ చేశాడు.
నడి వీధిలోనే తుపాకీని కాల్పుల కోసం ప్రిపేర్ చేశాడు. బెల్జియం, స్వీడన్ మధ్య ఫుల్ బాల్ మ్యాచ్ ప్రారంభం కాబోతుండగా ఉగ్రవాది జన సమూహంపై కాల్పులు జరిపాడు. దీంతో మ్యాచ్ ను రద్దు చేశారు. అనంతరం తాను ఐసిస్ కు చెందిన వాడినని ఆన్ లైన్ వేదికగా ప్రకటించుకున్నాడు.
Pune Accident : పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం…నలుగురి మృతి, ఇద్దరికి గాయాలు
మరోవైపు ఈ కాల్పుల ఘటనతో బ్రస్సెల్స్ లో టెర్రరిస్టు హెచ్చరికను అత్యున్నతస్థాయికి పెంచుతూ అధికారులు హైఅలర్ట్ జారీ చేశారు. బస్సెల్స్ లోని ప్రజలందరూ ఇళ్లల్లోనే ఉండాలని సూచించారు. యూరోపియన్ కమిషన్ సిబ్బంది బయటికి రావొద్దని పిలుపునిచ్చారు.