Libya floods : లిబియా వరదల్లో 2వేల మంది మృతి, వేలాదిమంది గల్లంతు

తూర్పు లిబియా దేశంలో వెల్లువెత్తిన వరదల్లో 2వేలమంది మరణించారు. తుపాన్ ప్రభావంతో కురిసిన భారీవర్షాల కారణంగా డెర్నా నగరంలో 2వేల మంది మరణించారని, వేలాదిమంది వరదల్లో గల్లంతు అయ్యారని తూర్పు లిబియా అధికారులు చెప్పారు....

Libya floods

Libya floods : తూర్పు లిబియా దేశంలో వెల్లువెత్తిన వరదల్లో 2వేలమంది మరణించారు. తుపాన్ ప్రభావంతో కురిసిన భారీవర్షాల కారణంగా డెర్నా నగరంలో 2వేల మంది మరణించారని, వేలాదిమంది వరదల్లో గల్లంతు అయ్యారని తూర్పు లిబియా అధికారులు చెప్పారు. మధ్యధరా తుపాన్ డేనియల్ లిబియాలో వినాశనానికి కారణమైంది. ఈ తుపాన్ ప్రభావం వల్ల ఉత్తర ఆఫ్రికా దేశంలోని తీర పట్టణాల్లో వ్యవసాయభూములు వరదనీటితో మునిగిపోయాయి. (Eastern Libya floods)

Nipah virus : కేరళలో నిపా వైరస్ మహమ్మారి…ఇద్దరి మృతి

డెర్నా పట్టణంలోని నదిపై ఉన్న ఆనకట్ట వరదలతో కూలిపోవడంతో విపత్తు సంభవించిందని లిబియా నేషనల్ ఆర్మీ ప్రతినిధి అహ్మద్ మిస్మారీ చెప్పారు. ఈ వరద విపత్తులో గల్లంతైన వారి సంఖ్య 6 వేలమంది దాకా ఉంటుందని ఆర్మీ ప్రతినిధి పేర్కొన్నారు. (thousands missing after storm hits Derna) లిబియా తూర్పు, పడమరల మధ్య విభజించారు.

Kim Jong Un : పుతిన్‌ను కలిసేందుకు రష్యాకు రైలులో బయలుదేరిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్

ట్రిపోలీలో విభజించిన దేశంలో దేశాధినేతగా పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తుల అధ్యక్ష మండలి అంతర్జాతీయ సమాజాన్ని సహాయం కోరింది. తూర్పు లిబియాలోని 2వేల మంది మరణించగా, వేలాదిమంది తప్పిపోయారని తూర్పు ఆధారిత పరిపాలన అధిపతి ఒసామా హమద్ ధ్రువీకరించారు. గత వారం గ్రీస్ దేశాన్ని ముంచెత్తిన తుపాన్ విపత్తు మధ్యధరా సముద్రంలోకి దూసుకెళ్లింది. వరదల వల్ల డెర్నా నగరంలో భవనాలు, రోడ్లు దెబ్బతిన్నాయి. లిబియాలోని సముద్ర తీరంలోని భవనాలు ధ్వంసం అయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు