Nipah virus : కేరళలో నిపా వైరస్ మహమ్మారి…ఇద్దరి మృతి

కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ ప్రబలుతుండటంతో ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. నిపా వైరస్ ఇన్‌ఫెక్షన్ కారణంగా ఇద్దరు మరణించడంతో కోజికోడ్ జిల్లాలో హెల్త్ అలర్ట్ ప్రకటించింది....

Nipah virus : కేరళలో నిపా వైరస్ మహమ్మారి…ఇద్దరి మృతి

Nipah virus

Nipah virus : కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ ప్రబలుతుండటంతో ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. నిపా వైరస్ ఇన్‌ఫెక్షన్ కారణంగా ఇద్దరు మరణించడంతో కోజికోడ్ జిల్లాలో హెల్త్ అలర్ట్ ప్రకటించింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఉన్నత స్థాయి అధికారుల సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నిపా వైరస్ కారణంగా ఇద్దరు మరణించారని వైద్యాధికారులు అనుమానిస్తున్నారు. (Nipah Alert)

IND VS PAK : కుల్దీప్ మాయ‌.. పాకిస్తాన్ పై 228 ప‌రుగుల భారీ తేడాతో భార‌త్ ఘ‌న విజ‌యం

మరణించిన వారిలో ఒకరి బంధువులు కూడా ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేరారు. (Kerala After Two Deaths) 2018,2021 సంవత్సరాల్లో కోజికోడ్ జిల్లాల్లో నిపా వైరస్ సంక్రమణ కారణంగా పలువురు మరణించారు. నిపా వైరస్ మొదటికేసు 2018 మే 19వతేదీన కోజికోడ్ నగరంలో నమోదైంది.

Gudivada Amarnath : చంద్రబాబు తర్వాత జైలుకెళ్లేది అతడే? ఇది శాంపిల్ మాత్రమే, మమతా బెనర్జీ చెప్పింది అదే- మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలనం

నిపా వైరస్ జంతువుల నుంచి ప్రజలకు సంక్రమించే జూనోటిక్ వ్యాధి. ఈ వ్యాధి కలుషితమైన ఆహారం ద్వారా కూడా సంక్రమిస్తోంది. ఈ వ్యాధి సోకితే శ్వాసకోశ అనారోగ్యం, ప్రాణాంతక ఎన్సెఫాలిటిస్ ఏర్పడుతోంది. ఈ నిపా వైరస్ పందుల ద్వారా వ్యాప్తిచెందుతోంది.