Amendment To The Uae Cybercrime Law..accident Photos..videos
Amendment to the UAE Cybercrime Law : కళ్లముందే పబ్లిక్ గా నేరాలు జరుగుతున్నా అడ్డుకోం సరికదా..వినోదంగా చూస్తూ నిలబడతాం. స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఆ ఘోరాలు జరుగుతుంటే అడ్డుకోకపోగా.. ఫోటోలు తీయటం..వీడియోలు తీయటం అనేది సర్వసాధారణమైపోయింది. ఆఖరికి కళ్లముందే ప్రమాదం జరిగి ఎవరైనా చావుబతుకుల్లో కొట్టుమిట్టాడతున్నా వారిని రక్షించే యత్నం కూడా చేయకుండా ఫోటోలు..వీడియోలతో టైమ్ పాస్ చేయటం జరుగుతోంది. కనీసం ఒకే ఒక్క ఫోన్ కాల్ తో అంబులెన్స్ కు సమాచారం కూడా అందించకుండా ఫోటోలు వీడియోలు తీయటంలో మునిగిపోతుంటారు జనాలు. కళ్లముందు జరిగిన నేరాలను..యాక్సిడెంట్లను ఫోటోలు,వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం జరుగుతోంది.
Also read : Kerala CM Viral tweet : మలయాళంలో దుబాయ్ ప్రధాని ట్వీట్..అరబిక్ లో స్పందించిన కేరళ సీఎం
కానీ ఇకనుంచి ప్రమాదం జరిగిన ప్రాంతంలో గాయపడినవారి ఫోటోలు గానీ..చనిపోయినవారి ఫోటోలు తీసినా. వీడియోలు తీసినా జైలుకే అని వార్నింగ్ ఇచ్చింది దుబాయ్ ప్రభుత్వం. భారీ జరిమానా కూడా తప్పదంటూ వార్నింగ్ ఇచ్చింది యూఏఈ ప్రభుత్వం.
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు గాయపడ్డ వాళ్లను, చనిపోయినవాళ్లను వీడియోగానీ, ఫొటోలుగానీ తీస్తే కఠినంగా శిక్షించే చట్టాని తీసుకొచ్చింది ఇటీవల. ఈ రూల్ అతిక్రమించి ఎవరన్నా ఇలా చేస్తే జైలుకెళ్లటం ఖాయం అని హెచ్చరించింది. జైలు శిక్షతో పాటు లక్షా యాభై వేల దుబాయ్ దిర్‌హం (UAE Dirham)నుంచి ఐదు లక్షల దిర్‌హంల దాకా జరిమానా తప్పదని హెచ్చరించింది. లేదంటే ఆరు నెలల జైలు శిక్ష. ఒక్కోసారి రెండూ విధించనున్నట్లు యూఏఈ సైబర్‌క్రైమ్ చట్టానికి సవరణ తీసుకొచ్చింది.
జనవరి 2, 2022 నుంచే ఈ కొత్త చట్టం అమలులోకి వచ్చిందంటూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. నేరాలకు సంబంధించి గానీ..ఆయా ప్రమాదాలకు సంబంధించి గానీ సాక్ష్యాల సేకరణలో అధికారులకు మాత్రం మినహాయింపు ఉంటుంది. రోడ్డు ప్రమాదాల్లో బాధితుల ఫొటోలు, వీడియోలు తీయడం, వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం,ఫార్వార్డ్ చేయడం.. ఏదీ మంచిది కాదనే ఈ చట్టం తీసుకొచ్చాం అని చెబుతున్నారు దుబాయ్ అధికారులు.
Also read : Medical College : ఆనంద్ మహీంద్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ!.. ట్వీట్ వైరల్
అంతేకాదు..ఎవరినన్నా ఫోటో తీయాలంటే వారి అనుమతిని తప్పనసరి చేసింది.అనుమతులు లేకుండా వ్యక్తుల ఫొటోలు, వీడియోలు తీయడంపై కూడా కొరడా ఝుళిపించేందుకు చట్టాలన్ని మరింత కఠినం చేసింది. ఈ రూల్స్ అతిక్రమిస్తే సంత్సరం జైలు శిక్షతో పాటు రెండున్నర లక్షల నుంచి ఐదు లక్షల దాకా దిర్‌హం జరిమానా, లేదంటే రెండూ విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. అలాగే ఇంటర్నెట్‌లో వెంటాడి.. వేధించే నిందితుల (డిజిటల్ స్టాకర్స్ )కు ఆరు నెలల జైలు శిక్ష, 1 లక్షా 50 వేల నుంచి ఐదు లక్షల దిర్‌హం దాకా జరిమానా లేదంటే రెండూ విధించనుంది దుబాయ్ ప్రభుత్వం.