Kerala CM Viral‌ tweet : మలయాళంలో దుబాయ్‌ ప్రధాని ట్వీట్..అరబిక్ లో స్పందించిన కేరళ సీఎం

దుబాయ్‌ పాలకుడు షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌, కేరళ సీఎం పినరాయి విజయన్ చేసుకున్న ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Kerala CM Viral‌ tweet : మలయాళంలో దుబాయ్‌ ప్రధాని ట్వీట్..అరబిక్ లో స్పందించిన కేరళ సీఎం

Dubai Ruler Kerala Cm Viral Tweet (1)

kerala CM Viral‌ tweet : దుబాయ్‌ పాలకుడు షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌, కేరళ సీఎం పినరాయి విజయన్ చేసుకున్న ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నేతలు ఒకిరికి మరొరకరు సోషల్ మీడియా వేదికగా మాట్లాడుకోవటం సర్వసాధారణమే. కానీ వీరిద్దరి మధ్యా జరిగిన ట్వీట్ వైరల్ కావటానికి ఓ కారణముంది.అదేమంటే దుబాయ్ పీఎసం కేరళ స్థానక భాష అయిన మలయాళంలో సీఎంకు ట్వీట్ చేస్తే..కేరళ సీఎం పినరాయి విజయన్ దుబాయ్ భాష అయిన అరబిక్ లో ట్వీట్ చేయటం విశేషం. అలా భాషలోనే కాదు యూఏఈ, కేరళ మధ్య చక్కటి అనుబంధం ఉందని ఒకరి భాషలో మరొకరు ట్వీట్ చేసుకోవటం విశేషంగా మారింది.

Also read : Jacqueline Fernandez : ఈ కేసుతో ఆమెకు సంబంధం లేదు.. బాలీవుడ్ భామపై సుకేష్ వ్యాఖ్యలు..

వైరల్ అవుతున్న ఈ ట్వీట్ లో ఆ నేతలు ఏమాట్లాడుకున్నారంటే..కేరళ, యూఏఈల మధ్య అనుబంధాన్ని చాటుతూ.. దుబాయ్‌ పాలకుడు, యూఏఈ ప్రధాని షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తుం తాజాగా మలయాళంలో చేసిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. దుబాయ్‌ పర్యటనలో ఉన్న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ బుధవారం (ఫిబ్రవరి2,2022) ‘దుబాయ్ ఎక్స్‌పో- 2020’ వేదికగా మక్తుంతో సమావేశమయ్యారు.

Also read : Kacha Badam : దుమ్ములేపుతున్న ‘కచ్చా బాదమ్’.. సెలబ్రిటీలు, యూత్ డ్యాన్స్ మూమెంట్స్ కేక

ఈ కార్యక్రమం తరువాత దుబాయ్ పాలకుడు మక్తుం.. ‘యూఏఈకి కేరళతో ప్రత్యేక అనుబంధం ఉంది. దుబాయ్‌, యూఏఈ ఆర్థికాభివృద్ధిలో కేరళీయులు కీలక పాత్ర పోషిస్తున్నారు’ అని మలయాళంలో ట్వీట్‌ చేశారు.ఈ సందర్భంగా విజయన్‌తో భేటీ సందర్భంగా దిగిన ఫొటోను కూడా ట్వీట్ లో షేర్ చేశారు. ఈ ట్వీట్‌ కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రవాస మలయాళీలు ఈ ట్వీట్ ను షేర్‌ చేస్తున్నారు.

Also read : Mouni Roy : మ‌ల‌యాళీ, బెంగాలీ.. రెండు పద్ధతుల్లో మౌనిరాయ్ వివాహం.. వీడియో రిలీజ్

ఈ ట్వీట్‌కు సీఎం పినరాయి విజయన్ కూడా చాలా చక్కగా అరబిక్ భాషలో స్పందించటం విశేషం. మక్తుం ట్వీట్ కు సీఎం ‘మీ సాదర స్వాగతానికి, ఆతిథ్యానికి ధన్యవాదాలు’ అని అరబిక్‌లో ట్వీట్‌ చేశారు. యూఏఈ, దుబాయ్‌లతో దక్షిణ భారతదేశం తన అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తోందని అన్నారు. మరోవైపు వీరి సమావేశంలో భాగంగా కేరళ అభివృద్ధికి తోడ్పాటునందించడంపై దుబాయ్‌ పాలకుడికి విజయన్‌ కృతజ్ఞతలు తెలిపారని కేరళ సీఎం కార్యాలయం వెల్లడించింది.