Kacha Badam : దుమ్ములేపుతున్న ‘కచ్చా బాదమ్’.. సెలబ్రిటీలు, యూత్ డ్యాన్స్ మూమెంట్స్ కేక
మూమెంట్స్ మాత్రం మామూలుగా లేవు. బాయ్స్ ఎనర్జీతో స్టెప్పులేస్తుంటే.. గాళ్స్, ఉమన్ సెలబ్రిటీలు, నాజూకు బ్యాచిలర్, సింగిల్ ముద్దుగుమ్మలు ఈ స్టెప్పులకు తమ సోయగాలను జతచేసి.. సోషల్ మీడియ

Kacha Badam Song Goes Viral
Kacha Badam : సోషల్ మీడియాలో ట్రెండింగ్ కూడా కరోనా వైరస్ లాంటిదే. పూటకో వేరియంట్.. సీజన్ సీజన్ కూ ఓ వైరల్ సాంగ్. ఈ వైరల్ పాటలు, కంటెంట్ కు ప్రాంతీయ భేదం ఉండదు. ఖండాలు.. సముద్రాలు.. పీఠభూములు.. కొండలు.. గుట్టలు.. నదులు.. అడవులు.. ఆదివాసీ గూడేలు దాటి.. అందిరినీ చుట్టేస్తుంటాయి. వారిలో పూనకం తెప్పించి స్టెప్పులేయిస్తుంటాయి.
Read This : Mouni Roy : మలయాళీ, బెంగాలీ.. రెండు పద్ధతుల్లో మౌనిరాయ్ వివాహం.. వీడియో రిలీజ్
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్స్టాగ్రామ్ లో లేటెస్ట్ ట్రెండింగ్ సాంగ్ కచ్చా బాదమ్(Kacha Badam- BADAM BADAM KACHA BADAM). కొన్ని వారాలుగా ఈ పాట ఊపే ఊపుడుకు ఒక్క ఇన్ స్టా రీల్సే కాదు.. షార్ట్స్, జోష్, మాజ్.. అన్ని షార్ట్ వీడియో ప్లాట్ ఫామ్ లు షేకవుతున్నాయి.
ఓ పల్లెటూరి పాటగాడు.. బాదామ్.. బాదామ్.. కచ్చా బాదామ్ అంటూ పాడే ఈ పాట గమ్మత్తుగా ఉంటుంది. మంచి మ్యూజిక్ బీట్ ఉండటంతో.. స్టెప్ కూడా వైరల్ అయింది. అదే స్టెప్పుకు ఎక్స్ ప్రెషన్స్ మిక్స్ చేసి.. రిపీట్ చేసి లైక్లు, కామెంట్లు కొట్టేస్తున్నారు సెలబ్రిటీలు, టాలెంటెడ్ యూజర్స్.
Read This : Raviteja : తమిళ్ హీరో సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్న మాస్ మహారాజ్
మూమెంట్స్ మాత్రం మామూలుగా లేవు. బాయ్స్ ఎనర్జీతో స్టెప్పులేస్తుంటే.. గాళ్స్, ఉమన్ సెలబ్రిటీలు, నాజూకు బ్యాచిలర్, సింగిల్ ముద్దుగుమ్మలు ఈ స్టెప్పులకు తమ సోయగాలను జతచేసి.. సోషల్ మీడియాలో ఆరబోసేస్తున్నారు.
గల్లీ గల్లీ తిరిగి పల్లీలు, బాదామ్ లు, డ్రై ఫ్రూట్స్ అమ్ముకునే సైకిల్ వ్యాపారి నుంచి ఈ పాట పుట్టింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పాటకు సంబంధించిన కొన్ని వీడియోలను కింద లింక్ లలో చూసేయండి.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram