Spy Cameras In Women Bathroom
spy cameras in women bathroom : 57 ఏళ్లు వయస్సు. మంచీ చెడూ అంటే ఏంటో పిల్లలు చెప్పాల్సిన వయస్సు. కానీ చేసేది గలీజు పని. పక్కదారులు పట్టిన బుర్రతో తన చేసే ప్లంబరింగ్ వత్తిని ఆసరాగా చేసుకున్నాడు. బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టి ఎంతోమంది మహిళల ఫోటోలు..వీడియోలు చూసి ఆనందించటం వాడి పైశాచికత్వానికి నిదర్శనం. చిన్నారులని కూడా చూడకుండా బాత్రూమ్ లో స్నానంచేసే ఫోటోలు, వీడియోలుచూస్తు ఆనందించే శాడిస్టు. బాత్రూమ్ రిపేర్ అని చెబితే చాలు వాలిపోతాడు ఆ ప్లంబర్. రిపేయిర్ చేయడానికి వెళ్ళి బాతురూమ్ల్లో సిక్రెట్ కెమెరాలు పెట్టి… మహిళల వీడియోలు సేకరిస్తుంటాడు. అలా ఓ మహిళ తన బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరాను చూసి షాక్ అయ్యింది.వెంటనే పోలీసులకు ఫోన్ చేసి అతడని భరతం పట్టింది. అతనిచేసిన పనికి అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో సబ్మిట్ చేయగా వాడికి కోర్టు ఏడాది జైలుశిక్ష విధించిన ఘటన యూకేలో జరిగింది.
Read more : Hyderabad : హోటల్ లో లేడీస్ బాత్రూములో సీక్రెట్ కెమెరా
బ్రిటన్‌లోని నాటింగ్‌హామ్‌లో నివసిస్తున్న ఓ మహిళ 2018 జూన్ 15న తన బాత్‌రూమ్‌ను రిపేర్ అయితే ఓ ప్లంబర్ కు ఫోన్ చేసింది. రిపేర్ చేయడానికి వచ్చిన 57 ఏళ్ల ప్లంబర్ ఆమె బాత్రూమ్ సీక్రెట్ కెమెరాను ఫిక్స్ చేశాడు. అలా ఆ కెమెరాతో బాత్రూంలో ఆమె కదలికలన్నీ రికార్డ్ చేస్తున్నాడు. ఒకరోజు ఆ మహిళ రహస్య కెమెరాను చూసి షాక్ అయ్యిది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమెను ప్రశ్నించగా బాత్రూమ్ రిపేర్ ఉంటే జేమ్స్ హుల్మ్ అనే ఓ ప్లంబర్‌ని పిలిచానని చెప్పింది.దాంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతడిని గుర్తించి అరెస్టు చేశారు.
Read more : How to Detect Hidden Cameras :సీక్రెట్ కెమెరాల్ని ఈ ట్రిక్స్‌తో కనిపెట్టేయండీ..సేఫ్ గా ఉండండీ..
అనంతరం అతని ఇంట్లో దొరికిన వస్తువులను చూసి పోలీసులే షాక్ అయ్యారు. గట్టిగా విచారించేసరికి అసలు విషయం ఒప్పుకున్నాడు. తను పలువురి బాత్‌రూమ్‌లలో రహస్య కెమెరాలు అమర్చానని ఒప్పుకున్నాడు. అతని కంప్యూటర్‌లో 302 చిన్నారుల అశ్లీల ఫొటోలు..పలువురు మహిళల అశ్లీల ఫొటోలు కూడా లభ్యమయ్యాయి. అతడిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతనికి 12 నెలల జైలు శిక్ష విధించింది.