Pm Modi Jordan Tour: జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ.. ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం.. ఈ అంశాలపై కీలక చర్చలు..
ప్రవాస భారతీయులతోనూ ప్రధాని మోదీ సమావేశం కానున్నారు.
Pm Modi Jordan Tour: భారత ప్రధాని నరేంద్ర మోదీ జోర్డాన్ చేరుకున్నారు. జోర్డాన్ రాజధాని అమ్మాన్ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. జోర్డాన్ ప్రధాని జాఫర్ హస్సన్ ఎయిర్ పోర్టులో మోదీని స్వయంగా రిసీవ్ చేసుకున్నారు. 2 రోజుల (డిసెంబర్ 15,16 తేదీలలో) పర్యటన నిమిత్తం మోదీ జోర్డాన్ చేరుకున్నారు. ఆ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రధాని పర్యటన సాగనుంది. భారత్-జోర్డాన్ మధ్య దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
జోర్డాన్ రాజు II అబ్దుల్లా ఇల్ బిన్ అల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ జోర్డాన్ వెళ్లారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా, ప్రధాని జాఫర్‌తో భేటీ కానున్నారు. పలు అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. ప్రవాస భారతీయులతోనూ ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ పర్యటనలో భాగంగా సోమవారం జోర్డాన్ చేరుకున్నారు ప్రధాని మోదీ. పశ్చిమాసియా, ఆఫ్రికా ప్రాంతాల్లోని మిత్ర దేశాలతో సంబంధాలు మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన లక్ష్యం.
”నేను అమ్మాన్ చేరుకున్నా. ఎయిర్ పోర్టులో నాకు ఆత్మీయ స్వాగతం లభించింది. జోర్డాన్ ప్రధాని జాఫర్ హసన్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగు పరుస్తుందనని ఆశిస్తున్నా” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
ప్రధాని మోదీ పర్యటన 4 రోజులు ఉండనుంది. ముందుగా ఆయన జోర్డాన్ చేరుకున్నారు. ఆ తర్వాత ఇథియోపియా, ఒమన్‌లలో పర్యటించనున్నారు. జోర్డాన్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ ఇథియోపియాకి వెళ్తారు. ప్రధాని హోదాలో ఆయన ఇథియోపియాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఇథియోపియా ప్రధానితో ద్వైపాక్షిక సంబంధాల సహా పలు అంశాలపై చర్చించనున్నారు. ఆ తర్వాత ఒమన్ లో పర్యటిస్తారు. భారత్ ఒమన్ మధ్య దౌత్య సంబంధాలకు 70ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ పర్యటన ఉండనుంది.
Also Read: సిడ్నీ కాల్పుల ఘటన: ఉగ్రవాది నుంచి తుపాకీ లాక్కుని.. టూరిస్టుల ప్రాణాలు కాపాడిన ఈ వీరుడు ఎవరు?
Landed in Amman.
Thankful to Mr. Jafar Hassan, Prime Minister of the Hashemite Kingdom of Jordan for the warm welcome at the airport. I am sure this visit will boost bilateral linkages between our nations.@JafarHassan pic.twitter.com/Qba5ZLs4Io
— Narendra Modi (@narendramodi) December 15, 2025
