How to Detect Hidden Cameras :సీక్రెట్ కెమెరాల్ని ఈ ట్రిక్స్‌తో క‌నిపెట్టేయండీ..సేఫ్ గా ఉండండీ..

బాత్రూమ్స్,హోటల్ రూమ్స్, షాపింగ్ మాల్స్ వంటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు స్పై కెమెరాలను ఎలా గుర్తించాలి. ఎలా సేఫ్ గా ఉండాలో తెలుసుకోండీ..

How to Detect Hidden Cameras :సీక్రెట్ కెమెరాల్ని ఈ ట్రిక్స్‌తో క‌నిపెట్టేయండీ..సేఫ్ గా ఉండండీ..

How To Detect Hidden Cameras

How to Detect Hidden Cameras : రెండు రోజుల క్రితం హైదరాబాద్ లోని ఓ హోటల్ లో లేడీజ్ బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరా అమర్చిన విషయం బయటపడి ఎంత కలకలం సృష్టించిందో తెలిసిందే. ఇటువంటివిచాలా ప్రాంతాల్లో జరుగుతోంది. హోటల్స్‌ బాత్రూమ్స్, షాపింగ్‌మాల్స్‌, హోటల్ రూమ్స్ ఇలా ఇంకా ఇతర ప్రదేశాల్లో ఇటువంటివి జరుగుతున్నాయి. అంతేకాదు స్పై కెమెరాలతో వ్యక్తిగత జీవితాలు కూడా పబ్లిక్ అయిపోతున్నాయి. కొంతమంది ఇటువంటిచర్యలకు పాల్పడుతు వారిని బ్లాక్ మెయిల్ చేయటం వంటివి కూడా జరుగుతున్నాయి. షాపింగ్ మాల్స్ కు వెళ్లినప్పుడు ట్రైల్ రూముల్లో కూడా ఇటువంటి ఘటనలు జరిగాయి.

ఈస్పై కెమెరాల వల్ల సామాన్యల నుంచి ప్రముఖుల వరకు ఎన్నో సమస్యలు. కొంతమంది వెధవలు . గుట్టుచప్పుడు కాకుండా స్పై, హిడెన్‌ కెమెరాలు పెట్టి ఫొటోలు, వీడియోలు, మనవాళ్లతో ప్రైవేటుగా ఉన్న వీడియోలు చిత్రీకరించి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. గోవా పర్యటనలో కేంద్ర మంత్రి స్మృతిఇరానీకే ఇటువంటి అనుభవం ఎదురైందీ అంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటీ. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌-10లోని వన్‌ డ్రైవ్‌ ఫుడ్‌కోర్టు రెస్టారెంట్‌ లేడీస్‌ టాయిలెట్‌లో ఓ హౌస్‌కీపింగ్‌ బాయ్‌ ఫోన్‌ పెట్టి ప్రైవేటు దృశ్యాలను రికార్డు చేస్తున్నట్టు వెలుగులోకి రావడం కలకలం సృష్టించింది.

Read more : Hyderabad : హోటల్‌ లో లేడీస్ బాత్రూములో సీక్రెట్ కెమెరా

మన కళ్లే సీక్రెట్ కళ్లను వెతకాలి..
హోటళ్లు, షాపింగ్‌ మాల్స్‌కు వెళ్లినప్పుడు వాష్‌రూంలు వాడే సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే.లేకుంటే ఎక్కడ ఏ కెమెరా కన్ను మనల్ని గమనిస్తుందో మరి. ట్రయల్‌ రూములు, హోటల్‌ గదుల్లో గోడలు, మూలలపై, స్విచ్‌బోర్డులు, ఫ్యాన్లు, బల్బు హోల్డర్లు, పూల కుండీలు, డెకలేషన్స్ వస్తువులు, వాల్ క్లాక్స్, డెస్క్‌ టేబుళ్లు, టేబుల్‌ ల్యాంప్‌లు, ఫొటో ఫ్రేమ్‌లు, స్విచ్‌బోర్డులు ఏదైనా ఆఖిరికి స్క్రూలు కూడా స్పై కెమెరాలకు దాచిపెట్టేవిగా ఉండొచ్చు.

వాటిని నిశితంగా పరిశీలించాలి. ఏవైనా చిన్న రంధ్రాలు ఉన్నట్టు గుర్తిస్తే అక్కడ సీక్రెట్‌ కెమెరా ఉన్నట్టు అనుమానించి నిర్ధారణ చేసుకోవాలి.హిడెన్‌ కెమెరా కనిపిస్తే కంగారు పడకుండా పోలీసులకు సమాచారం అందించాలి. అలా ఏవైనా కనిపిస్తే వాటిని టచ్ చేయకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఒకవేళ పొరపాటున వాటిని తాకితే వాటిపైన ఉన్న నిందితుడి వేలిముద్రలు పోతాయి. దీంతో అవి ఎవరు ఏర్పాటు చేశారో తెలియకుండాపోతుంది.

Read more :

అటువంటివి కనిపిస్తే వాటి ఫొటోలను తీసి జాగ్రత్తగా పెట్టాలి. స్పై కెమెరాలు పెట్టిన ప్రదేశం నుంచి మనం ఇతరులకు ఫోన్‌కాల్‌ చేస్తే కాల్‌ డ్రాప్‌ అవుతుంది. స్పై కెమెరాల్లో ఉండే మ్యాగ్నటిక్‌ తరంగాల వల్ల ఇలా జరుగుతుంది. కానీ కాల్‌డ్రాప్‌ అయినంత మాత్రాన అక్కడ స్పై కెమెరా ఉందని కచ్చితంగా చెప్పలేం.ట్రయల్‌ రూములు, వాష్‌రూముల్లోకి వెళ్లగానే బాత్రూమ్ ని క్షుణ్ణంగా పరిశీలించారు. అద్దాలు, స్ర్కూలు,పైన టాప్ అన్ని పరిశీలించారు.అలాగే అద్దంమీద మన వేలుగానీ చేయి గాని పెడితే..అద్దానికి వేలికి మధ్య కొంత ఖాళీ ఉన్నట్టు గుర్తిస్తే అది సేఫ్‌. అద్దంలోని మన వేలి ప్రతిబింబంతో వేలు టచ్‌ అయితే అది ప్రమాదకరమైన పారదర్శకమైన గ్లాస్‌ అని గుర్తించాలి.

మీరు ఉన్న గదిలో లైట్లను ఆర్పివేసి సెల్‌ఫోన్‌లోని టార్చ్‌లైట్‌ను అద్దంపైన వేస్తే అవతలివైపు ఏవైనా ఉంటే కనిపిస్తుంది. మొబైల్‌ ఫ్లాష్‌తో కూడా గుర్తించవచ్చు. ముందుగా ఆ గదిలో లైట్లు ఆపి..చీకటి రూమ్ లో మొబైల్‌ కెమెరా ఫ్లాష్‌ను ఆన్‌చేసి గదిలోని అన్ని ప్రాంతాల్ని చెక్‌ చేయాలి. అక్కడ ఎంత చిన్న స్పై కెమెరా ఉన్నా దాని లెన్స్‌పైన ఫోన్‌ ఫ్లాష్‌ పడితే వెంటనే మెరుస్తుంది. దీంతో అక్కడ కెమెరా ఉన్నట్లుగ తెలిసిపోతుంది. స్మార్ట్‌ఫోన్‌లో హిడెన్‌ కెమెరా డిటెక్టర్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకొని కూడా ఈ కెమెరాలను కనిపెట్టవచ్చు. అయితే ఈ యాప్స్‌ ద్వారా ఫోన్‌లోకి వైరస్‌లు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలా స్పై కెమెరాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం అందరికి మంచిది.