Smartwatch Saves Life : గుండెపోటుకు గురైన వ్యక్తి ప్రాణాన్ని కాపాడిన స్మార్ట్‌వాచ్

ఆరు రోజులు కరోనరీ యూనిట్‌లో ఉన్న అతను కోలుకున్నాక తిరిగి ఇంటికి వెళ్ళారు. ఆరోగ్యం నయం అయిన తర్వాత అతని తిరిగి విధులకు హాజరు కానున్నారు. అయితే ఈ ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిందని వాపమ్ అన్నారు.

Smartwatch Saves Life : గుండెపోటుకు గురైన వ్యక్తి ప్రాణాన్ని కాపాడిన స్మార్ట్‌వాచ్

Smartwatch Saves Life From Heart Attack

Updated On : November 9, 2023 / 2:13 PM IST

Smartwatch Saves Life From Heart Attack : యూకేలో గుండెపోటుకు గురైన వ్యక్తి ప్రాణాన్ని స్మార్ట్‌వాచ్ కాపాడింది. యూకే కంపెనీ సీఈవో నడుచుకుంటూ వెళ్తుండగా అకస్మాత్తుగా అతను గుండెపోటుకు గురయ్యాడు. అయితే స్మార్ట్‌వాచ్ అతని ప్రాణాలను కాపాడింది. యూకేలోని 42 ఏళ్ల వ్యక్తి గుండెపోటు నుండి బయటపడటానికి స్మార్ట్ వాచ్ ఎలా సహాయపడిందో తెలియజేశారు. వివరాళ్లోకి వేళ్తే యూకేలోని హాకీ వేల్స్ సంస్థ సీఈవో పాల్ వాపమ్ స్వాన్సీలోని మోరిస్టన్ ప్రాంతంలోని తన ఇంటి దగ్గర ఉదయం పరిగెత్తుతుండగా, అతని ఛాతీలో తీవ్రమైన నొప్పి వచ్చింది.

అతను తన స్మార్ట్ వాచ్ ద్వారా భార్యకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఆమె అతన్ని ఆసుపత్రికి తరలించారు. పాల్ వాపమ్ వేల్స్ ఆన్‌లైన్‌తో మాట్లడుతూ తాను మామూలుగా ఉదయం 7 గంటలకు మార్నింగ్ కు వెళ్ళానని తెలిపారు. ఐదు నిమిషాలలో ఛాతీలో విపరీతమైన నొప్పి వచ్చిందని చెప్పారు. ఛాతీ బిగుతుగా అనిపించడంతో రోడ్డుపై చేతులు, మోకాళ్లపై ఉన్నానని పేర్కొన్నారు. మొదట్లో కాస్త బిగుతుగా ఉన్నా ఆ తర్వాత వైస్ లాగా పిండినట్లు అనిపించిందన్నారు.

Dog Saved owner Life : యజమాని వేలు కొరికేసిన కుక్క .. ప్రాణం కాపాడిన కుక్కకు అదే వేలును ఆహారంగా వేసిన యజమాని

భరించరాని నొప్పి వచ్చిందన్నారు. అప్పుడు తన వాచ్‌ని ఉపయోగించి భార్య లారాకు ఫోన్ చేసి విషయం తెలియజేశానని చెప్పారు. అదృష్టవశాత్తూ తన భార్య కేవలం ఐదు నిమిషాల దూరంలో ఉన్న తనకు దగ్గరకు వచ్చి కారులో ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలిపారు. ఆమె పరిగెత్తుకెళ్లి పారామెడిక్స్ ను పిలవడంతో వారు త్వరగా వచ్చి వైద్యం అందించడం ప్రారంభించారని తెలిపారు. అతని ధమనులలో ఒకదానిలో రక్తం సరఫరా కాకుండా పూర్తిగా అడ్డుపడటం వల్ల గుండెపోటు వచ్చినట్లు వైద్యులు కనుగొన్నారు.

ఆ తర్వాత అతన్ని ఆసుపత్రి కార్డియాక్ సెంటర్‌లోని కాథెటరైజేషన్ లేబొరేటరీకి తీసుకువెళ్లారు. అతనిలోని బ్లాక్ అయిన ధమనిని వైద్యులు క్లియర్ చేశారు. ఆరు రోజులు కరోనరీ యూనిట్‌లో ఉన్న అతను కోలుకున్నాక తిరిగి ఇంటికి వెళ్ళారు. ఆరోగ్యం నయం అయిన తర్వాత అతని తిరిగి విధులకు హాజరు కానున్నారు. అయితే ఈ ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిందని వాపమ్ అన్నారు. తాను అధిక బరువుగా లేనని, తనను తాను ఫిట్‌గా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి తనకు ఎటువంటి ప్రమాదం లేదన్నారు.

Slippers Saved Woman Life : మహిళ ప్రాణం కాపాడిన చెప్పులు

కానీ, ఈ ఘటన కొంచెం షాక్‌గా ఉందన్నారు. ఇది నిజంగా తన కుటుంబంతో సహా అందరికీ షాక్‌ని కలిగించిందని తెలిపారు. తనకు అండగా నిలిచిన సతీమణికి, ఆసుపత్రి సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాను పొందిన సంరక్షణ అద్భుతమైందిగా పేర్కొన్నారు. సిబ్బంది గురించి తగినంతగా మాట్లాడలేకపోతున్నానని చెప్పారు. తనను ఆసుపత్రికి తీసుకువచ్చినందుకు తన భార్యకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.

ఈ ఘటన తన భార్యకు కూడా షాక్‌ కు గురి చేసిందన్నారు. రెండు గంటల పాటు తీవ్ర ఉద్రిక్తత నెలకొందన్నారు. మనకు అత్యవసర విభాగం అవసరమైనప్పుడు, సిబ్బంది మనకు అండగా ఉన్నప్పుడు ఎంతో భరోసా కల్గుతుందన్నారు. అక్కడి ఆస్పత్రి సిబ్బంది చాలా అద్భుతంగా పని చేశారని, వారందరికీ తాను చాలా కృతజ్ఞతలు చెబుతున్నానని తెలిపారు.

Squirrel Play With Humans : ప్రాణం కాపాడిన బాలుడిని వదిలి వెళ్లనంటున్న బుజ్జి ఉడుత..

కాగా, చాలా సందర్భాలలో స్మార్ట్‌వాచ్‌లు ప్రాణాలను రక్షించినట్లు నిరూపించబడ్డాయి. హృదయ స్పందన రేటు, ఈసీజీ, మరిన్నింటిని కొలిచే సెన్సార్‌లను ఉపయోగించడం ద్వారా వినియోగదారుల ఆరోగ్యంలో అసాధారణతలను గుర్తించడం ద్వారా ఇది ప్రాణాలను ఎలా కాపాడిందనే దాని గురించి అనేక సంఘటనలు ఉన్నాయి.