పుల్లలతో ప్రపంచ ప్రసిద్ధ కట్టడాలను కట్టేస్తున్న 87 ఏళ్ల బ్రిటన్ వృద్ధుడు

England man makes taj mahal sticks : 50 ఏళ్ల వచ్చాయంటే అన్ని అభిరుచుల్ని వదిలేసుకుంటాం. ఇష్టా అయిష్టాలను వదిలేసుకుంటాం. హామీ అనే మాటే మరచిపోతాం. కానీ ఇంగ్లాండ్‌లోని షెఫ్‌ఫిల్డ్‌ నగరానికి చెందిన 87 సంవత్సరాల డెరిక్‌కు ఈ వయస్సులో కూడా తన అభిరుచులతో అద్భుతాలను సృష్టిస్తున్నారు. పుల్లలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధ కట్టడాల నమూనాలను తయారు చేస్తున్నారు. అదే ఆయన హామీ.

ఒక కట్టడాన్ని పూర్తి చేయటానికి డెరిక్‌ 10 నుంచి 12 నెలల సమయం పడుతుంది. పుల్లలతో కట్టడాల నమూనాను రూపొందించటానికి షెఫ్ ఫిల్డ్ తన ఇంట్లో ప్రత్యేకంగా షెల్ఫ్‌లను కూడా నిర్మించారు. తాను రూపొందించిన కళాఖండాలను ఆ షెల్ఫ్ లో పెడుతుంటారు.

దీనికి గురించి డెరిక్‌ మాట్లాడుతూ..‘ఈ మోడల్స్‌ అందంగా రావాలంటే క్రియేటివిటీ కంటే ఓపిక ఉండడం చాలా ముఖ్యం’ అంటారు.. ఈ వయస్సులో ఇంత ఓపికగా గంటల తరబడి చేయటం ఎందుకు? హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చుకదా అని అంటే..శేషజీవితంలో తన జీవనోత్సాహానికి తనకున్న ఈ హాబీనే కారణం అంటారాయన.

అలాగే మనదేశంలోని ఆగ్రాలో ఉన్న అరుదైన..అద్భుతమైన కట్టడం తాజ్‌మహల్‌ తయారు చేయడానికి డెరిక్‌ కు చాలా టైమ్‌ పట్టిందట. ‘ఇదొక పెద్ద ఛాలెంజ్‌’ అంటారాయన. తెలిసిన విద్య ఊరకేపోవడం ఎందుకు? అందుకే ఈ పని చిన్న పిల్లలకు కూడా నేర్పిస్తున్నానంటున్నారు డెరిక్‌.

ట్రెండింగ్ వార్తలు