England electric Vehicles (1)
England Electric vehicles : E-వాహనాలు. ప్రపంచమంతా ఇదే మాట. టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా ఎలక్ట్రిక్ వాహనాల తయారీపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు..ఈ వాహనాలతో పెరుగుతున్న వాయు కాలుష్యం వెరసి ఎలక్ట్రిక్ వాహనాల్ని కొనటానికి వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. వాటి తయారీపై ఆయా కంపెనీలు దృష్టిపెడుతున్నాయి.
దీని అనుగుణంగా దానికి తగిన ఏర్పాట్లు కూడా ఉండాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి తగినట్లుగానే దానికి తగిన ఏర్పాట్లు ఉండాల్సిందే. అంటే ఈ వాహనాలకు చార్జింగ్ పాయింట్లు వంటివి. దీంతో ఆయా దేశాల ప్రభుత్వాలు ఎలక్ట్రికల్ వెహికల్స్ కోసం కొత్త చట్టాల్ని తీసుకొస్తున్నాయి. వాటిని అమలు చేయటానికి సిద్ధమవుతున్నాయి.
Read more : Ather Electric Scooter: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరపై రూ.24వేల తగ్గింపు
దీంట్లో భాగంగానే తాజాగా ఇంగ్లాండ్ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోళ్లకు ప్రోత్సాహమిస్తూ ఓ కొత్త చట్టాన్ని అమలు చేయటానికి సిద్ధపడింది. దీని కోసం కొన్ని రూల్స్ కూడా పాస్ చేసింది. ప్రస్తుతం కట్టే నిర్మాణాలకు..భవిష్యత్తులో నిర్మించే నిర్మాణాలకు EV ఛార్జింగ్ ఏర్పాటు ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది.
Read more :China Best Cars : ప్రపంచంలోనే అత్యుత్తమ కార్లను తయారుచేస్తున్న డ్రాగన్ చైనా!
2030 నాటికి ఇంగ్లాండ్‌లో ఫ్యూయల్ వెహికల్స్‌ను పూర్తిగా బ్యాన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో భవిష్యత్ లో నిర్మించే ఆఫీస్‌లైనా..ఇళ్లు అయనా నిర్మాణాల్లో స్మార్ట్ ఛార్జింగ్‌లను ఏర్పాటు చేయాలని వెల్లడించింది. అలా ప్రతి ఐదు పార్కింగ్ ప్లేసులకు ఒక ఎలక్ట్రిక్ ఛార్జర్‌ను ఏర్పాటును తప్పని సరి అని స్పష్టంచేసింది. వీటిని కచ్చితంగా అమలు చేయాల్సిందేనని లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఎలక్ట్రిక్ వెహికల్ చట్టంపై ప్రసంశలు
ప్రపంచ వ్యాప్తంగా E- చట్టాన్ని అమలు చేసే దేశం ఇంగ్లాండే కావటం గమనించాల్సిన విషయం.ఈ చట్టంపై పలువురు దేశాది నేతలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంగ్లాండ్‌కు చెందిన ఇళ్లలో సరైన పార్కింగ్ లు, గ్యారేజీలు లేకపోవడంతో పర్యావరణం దెబ్బతింటుందని..ఈ కొత్త చట్టం అమలు చేయడం మంచిదేనని ప్రయోజకరంగా ఉంటుందని అమెరికన్ మీడియా ‘ఎలక్ట్రిక్’ తన కథనంలో పేర్కొంది.
ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సహించే దిశంగా అడుగులు వేస్తున్నప్పుడే ఇంగ్లాండ్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. 2019 లోనే కొత్త గృహాలకు పార్కింగ్ స్థలంతో ఛార్జ్ పాయింట్ ఉండాలని తప్పనిసరి చేయాలనే ప్రతిపాదనను ఇంగ్లండ్ ప్రభుత్వం ప్రకటించింది.ఈ ఆదేశాలు 2022కల్లా అమలు జరిగాల్సిందేనని తేల్చి చెప్పింది.