UK PM Boris Johnson: రహస్యంగా మూడో వివాహం చేసుకున్న బ్రిటన్ ప్రధాని

బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్.. వెస్ట్‌ మినిస్టర్‌ క్యారీ సైమండ్స్‌ను రహస్యంగా వివాహం చేసుకున్నారు. క్యారీ సైమండ్స్ బోరిస్ జాన్సన్‌ కంటే 23 సంవత్సరాలు చిన్నది. ఇరు కుటుంబాలు, స్నేహితుల సమక్షంలో నిరాడంబరంగా ఈ వివాహం జరిగింది.

Uk Pm Boris Johnson Marries Fiancee In Secret Ceremony Reports

Secret Marriage: బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్.. వెస్ట్‌ మినిస్టర్‌ క్యారీ సైమండ్స్‌ను రహస్యంగా వివాహం చేసుకున్నారు. క్యారీ సైమండ్స్ బోరిస్ జాన్సన్‌ కంటే 23 సంవత్సరాలు చిన్నది. ఇరు కుటుంబాలు, స్నేహితుల సమక్షంలో నిరాడంబరంగా ఈ వివాహం జరిగింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ నిబంధనలు అమలులో ఉండడంతో పెళ్లి కార్యక్రమానికి 30 మందికే అనుమతి ఉంది.

2020 ఫిబ్రవరిలో వీరిద్దరికీ నిశ్చితార్ధం జరిగింది. బ్రిటన్‌ ప్రధానికి 56 ఏళ్ల వయస్సు కాగా.. క్యారీ సైమండ్స్‌కు 33 సంవత్సరాలు. వీరికి ఇప్పటికే ఏడాది వయసున్న కొడుకు ఉన్నాడు. 2019లో జాన్సన్ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఇద్దరూ డౌనింగ్ స్ట్రీట్లో కలిసి ఉంటున్నారు. 1822లో లార్డ్‌ లివర్‌పూల్‌ తర్వాత బ్రిటన్‌ ప్రధాని పదవిలో ఉంటూ వివాహం చేసుకున్న తొలి వ్యక్తి బోరిస్‌ జాన్సన్‌.

బోరిస్‌ జాన్సన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రెండు సార్లు విడాకులు తీసుకున్నారు. తనకు ఎంతమంది పిల్లలు ఉన్నారో చెప్పేందుకు నిరాకరించారు. జాన్సన్‌ చివరి వివాహం మెరీనా వీలర్‌ అనే న్యాయవాదితో జరిగింది.

వీరికి నలుగురు సంతానం ఉండగా.. ఇద్దరు విడిపోయినట్లు 2018 సెప్టెంబర్‌లో ప్రకటించారు. బ్రిటన్ ప్రధాని 2019లో వివాహం కోసం క్యారీ సైమండ్స్‌కు ప్రతిపాదించారు. కొద్ది రోజుల తరువాత బోరిస్ జాన్సన్ పార్టీ ఇంగ్లాండ్‌ ఎన్నికలలో గెలిచింది. తరువాత బోరిస్ జాన్సన్ బ్రిటన్ ప్రధానమంత్రి అయ్యాడు.