భారత్-చైనా బోర్డర్ ఇష్యూ పై బ్రిటన్ ప్రధాని హాట్ కామెంట్స్

తూర్పు లడఖ్ లో చాలా తీవ్రమైన మరియు ఆందోళన కలిగించే పరిస్థితి నెలకొందని బ్రిటన్ ప్రధాని అన్నారు. చర్చల ద్వారా సరిహద్దు వివాదాన్ని భారత్‌, చైనాలు  సామరస్యంగా పరిష్కరించుకోవాలని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్ అన్నారు. తూర్పు లడఖ్‌లో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణలతో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయని, ఈ పరిణామాలు ఆందోళనకరమని బోరిస్  వ్యాఖ్యానించారు. 

బోర్డర్ లో భారత్‌-చైనాల మధ్య నెలకొన్న పరిణామాలను బ్రిటన్‌ నిశితంగా గమనిస్తోందని బ్రిటన్ ప్రధాని అన్నారు. కాగా, సరిహద్దు ఉద్రిక్తతలను నివారించేందుకు సేనల ఉపసంహరణపై భారత్‌, చైనా సైనికాధికారుల మధ్య ఏకాభిప్రాయం వ్యక్తమైనా డ్రాగన్‌ దూకుడు తగ్గడం లేదు. చర్చల్లో శాంతి మంత్రం జపిస్తూనే మరోవైపు తూర్పు లడఖ్‌ సహా వాస్తవాధీన రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో బలగాలను మోహరిస్తూనే ఉంది.

మే నెల మొదటివారం నుంచి నాలుగు ప్రాంతాల్లో..భారత్​-చైనా మధ్య తాజా సరిహద్దు ఉద్రిక్తతలుప్రారంభమయ్యాయి. తూర్పు లడఖ్, సిక్కింలోని నాలుగు ప్రాంతాల్లోని సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికులు బాహాబాహీకి దిగారు. ఈ నేపథ్యంలో చైనాకు దీటుగా బలగాలను తరలించింది భారత్. భారీ సంఖ్యలో వాయుసేనను కూడా మోహరించింది.

అప్పటి నుంచి వాస్తవాధీన రేఖ వెంబడి యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో జూన్​ 6న ఇరు దేశాల లెఫ్టినెంట్ జనరల్​ స్థాయి చర్చలు జరిగాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాలను ఉపసంహరించుకోవాలని ఇరువర్గాలు నిర్ణయించాయి. చైనా ఉల్లంఘనతో..గల్వాన్​లో జూన్ 15న ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో భారత్​కు చెందిన 20 మంది సైనికులు అమరులయ్యారు.76మంది భారత్ సైనికులు గాయపడ్డారు.  చైనా వైపున 40 మందికి మరణించినట్లు వార్తలు వచ్చిన.. 20 మందిలోపే చనిపోయారని తాజాగా వెల్లడించింది డ్రాగన్ దేశం 

Read: రూల్స్ పట్టించుకోలేదని తండ్రీకొడుకుల్ని పోలీసులే చంపేశారా..