కరోనా నిబంధనలు పాటించకపోతే..రూ. 10 లక్షల వరకు ఫైన్

  • Publish Date - September 21, 2020 / 01:51 PM IST

Prime Minister Boris Johnson : ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..కరోనా ఇంకా ఖతం కావడం లేదు. దీంతో కఠిన చర్యలు తీసుకొనేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కరోనా సోకినా..ఏ మాత్రం పట్టించుకోకుండా వ్యవహరస్తుండడంతో వారిపై కొరడా ఝులిపించేందుకు బ్రిటన్ ప్రభుత్వం సిద్ధమైంది.




ప్రస్తుతం బ్రిటన్ లో కరోనా సెకండ్ వేవ్ లో కొనసాగుతోంది. దేశ పౌరులు, పారిశ్రామిక వేత్తలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినపిస్తున్నాయి. ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో వైరస్ విపరీతంగా స్ప్రెడ్ అవుతోంది. దీంతో బ్రిటన్ అధ్యక్షుడు బోరిస్ జాన్సన్ కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు.

తాజాగా నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే పది వేల పౌండ్ల (దాదాపు రూ.10లక్షలు) వరకు జరిమానా విధిస్తామని బ్రిటన్ ప్రభుత్వం హెచ్చరించింది. కరోనా సోకిన వ్యక్తులు, వైరస్‌ లక్షణాలున్నవారు కచ్చితంగా 10 నుంచి 14రోజుల పాటు స్వీయ నిర్భంధంలో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.







ఈ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే 1000 నుంచి 10 వేల పౌండ్ల వరకు జరిమానా విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. సెప్టెంబర్‌ 28 నుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయని పేర్కొంది.




నిబంధలను అతిక్రమిస్తే 1,000 పౌండ్ల నుంచి జరిమాన స్టార్ట్ కానుంది. వివిధ దేశాల నుంచి వచ్చిన తర్వాత..క్వారంటైన్‌ ఉల్లంఘించినా, సిబ్బందిపై బెదిరింపుల పాల్పడే నేరాలు పునరావృతమయినా ఇది 10,000 పౌండ్లకు పెరుగుతుంది. అలాగే, క్వారంటైన్‌లో ఉన్నప్పుడు ఇంటి నుంచి పనిచేసే అవకాశం లేనివారికి 500 పౌండ్లు చెల్లించనుంది ప్రభుత్వం.