Indian Student(Photo : Google)
Indian Student – UK : ఉన్నత చదువుల కోసం యూకే వెళ్లిన భారతీయ విద్యార్థి దారితప్పాడు. ఓ యువతిని తన రూమ్ కి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విద్యార్థిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో అతడికి స్థానిక కోర్టు 9ఏళ్ల 6 నెలల జైలు శిక్ష విధించింది.
ఆ విద్యార్థి పేరు ప్రీత్ వికల్. వయసు 20ఏళ్లు. ఉన్నత చదువు అభ్యసించేందుకు యూకే వెళ్లాడు. తన ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్లాడు ప్రీత్ వికల్. ఆ సమయంలో ఓ యువతి అతడికి తారసపడింది. ఆమె మద్యం మత్తులో ఉంది. సరిగ్గా నిల్చోలేకపోతోంది. దాంతో ప్రీత్ వికల్ ఆమెను తన రూమ్ కి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు.
ప్రీత్ వికల్.. యువతిని తన రూమ్ కి తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రీత్ వికల్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అతడిని అదుపులోకి తీసుకున్నారు.
దీనిపై బాధితురాలు స్పందించింది. తనపై జరిగిన అఘాయిత్యంతో తనకు సరిగా నిద్రకూడా పట్టడం లేదని వాపోయింది. తాను స్పృహలోకి వచ్చాక జరిగిన దారుణం తనకు అర్థమైందన్నారు.
దీనిపై పోలీసులు స్పందించారు. ”కార్డిఫ్‌లోని నివాస గృహంలో మహిళపై అత్యాచారం చేసినందుకు ఒక వ్యక్తి జైలు పాలయ్యాడు. ప్రీత్ వికల్ బాధితురాలిని తన చేతులతో పట్టుకుని తీసుకెళ్లడం, ఆపై సిటీ సెంటర్ నుండి భుజాల మీదుగా మోసుకెళ్లినట్లు సీసీటీవీలో చూపించింది” అని సౌత్ వేల్స్ పోలీస్ కార్డిఫ్ ట్వీట్ చేసింది. “ఇలాంటి స్ట్రేంజర్ దాడులు కార్డిఫ్‌లో చాలా అసాధారణమైనవి. కానీ ప్రీత్ వికల్‌లో ఒక ప్రమాదకరమైన వ్యక్తి ఉన్నాడు. అతను.. మత్తులో ఉన్న, స్నేహితుల నుంచి విడిపోయిన, దుర్బలమైన యువతిపై అత్యాచారం చేశాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్రీత్ వికల్ ని అరెస్ట్ చేశాం” అని పోలీసులు తెలిపారు.
Preet Vikal, 20 ans, étudiant en ingénierie a transporté une jeune femme inconsciente, qu’il ne connaissait pas dans sa chambre après une soirée dans un club à Cardiff. Le lendemain il a dit qu’elle était consentante. https://t.co/01MJOnaumI https://t.co/oLGNEaQHM4 pic.twitter.com/qaGQHNd1Ai
— Euphorie ? (@_Oct14th) June 17, 2023