Ukraine
Russia – Ukraine war: యుక్రెయిన్ అక్రమణే లక్ష్యంగా రష్యా సైన్యం వేస్తున్న ఒక్కో అడుగు..యుద్ధాన్ని మరింత ఉదృతం చేస్తుంది. యుక్రెయిన్ రాజధాని కీవ్ సహా ప్రధాన నగరాలను రష్యా సైనికులు హస్తగతం చేసుకుంటున్నారు. మరోవైపు యుక్రెయిన్ లోకి వస్తున్న రష్యా సైనికులను ధీటుగా తిప్పికొడుతున్నారు యుక్రెయిన్ సైనికులు. తమకు సహాయం చేయండంటూ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మిత్ర దేశాలను కోరినా..ఎవరూ ముందుకు రాకపోవడంతో ఒంటరిగానే రష్యాతో యుద్ధం చేస్తుంది యుక్రెయిన్. ఈక్రమంలో రష్యా సైనికులను యుక్రెయిన్ ఎదుర్కొంటున్న తీరు భేష్ అనిపిస్తుంది.
Also read: St.Javelin Resistance: రష్యా సేనలను మట్టికరిపిస్తున్న యుక్రెయిన్ చేతిలో ఉన్న “ఆ ఆయుధం” ఏమిటి?
తమ నగరాల వీధుల్లో మారణహోమం సృష్టిస్తున్న రష్యా సైనికులను ఒక్కొక్కరిగా మట్టుపెడుతున్నామని, రష్యా యుద్ధ ట్యాంకులను, హెలీకాఫ్టర్లను, సైనిక రవాణా విమానాన్ని, ఇతర ఆయుధ రవాణా వాహనాలను ధ్వంసం చేస్తున్నట్లు యుక్రెయిన్ సైన్యం ప్రకటించింది. భీకరంగా సాగుతున్న ఈ యుద్ధంలో శనివారం వరకు 3500 మందికి పైగా రష్యా సైనికులను మట్టుపెట్టినట్లు యుక్రెయిన్ సైన్యం ప్రకటించింది. రష్యాకు చెందిన 102 ట్యాంకులు, 536 సాయుధ వాహనాలు, 15 ఫిరంగి వాహకాలను, 14 యుద్ధ విమానాలను, 8 హెలికాప్టర్లను, ఒక BUK-1 వ్యవస్థను ధ్వంసం చేశామని యుక్రెయిన్ సైన్యాధిపతి వెల్లడించారు.
Also read: Ukraine Kyiv Curfew : యుక్రెయిన్ రాజధాని కీవ్‌లో కర్ఫ్యూ.. రోడ్లపైకి ఎవరూ రావొద్దంటూ హెచ్చరిక!
మరోవైపు యుద్ధ నీతిని మరిచిన రష్యా.. యుక్రెయిన్ నగరాలలోకి వచ్చి అమాయక ప్రజలను బలి తీసుకుంటుందని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా ఏ విధమైన యుద్ధం చేస్తుందో ప్రపంచమంతా గమనిస్తుందని.. ఇప్పటికైనా రష్యాను తిప్పికొట్టేందుకు ప్రపంచ దేశాలు కదలి రావాలని జెలెన్స్కీ వేడుకుంటున్నారు. రష్యా దాడుల కారణంగా తమ సైనికుల కంటే సామాన్య ప్రజలే ఎక్కువ మంది మృతి చెందారని యుక్రెయిన్ విదేశాంగశాఖ ప్రకటించింది. రష్యా దాడిలో ఇప్పటివరకు 198 మంది పౌరులు మరణించి ఉంటారని యుక్రెయిన్ అధికారులు ప్రకటించారు.