Ukraine Kyiv Curfew : యుక్రెయిన్ రాజధాని కీవ్‌లో కర్ఫ్యూ.. రోడ్లపైకి ఎవరూ రావొద్దంటూ హెచ్చరిక!

యుక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. రష్యాతో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రాజధాని కీవ్ నగరంలో కర్ఫ్యూ విధించింది. ఎవరూ కూడా రోడ్లపైకి రావొద్దంటూ హెచ్చరించింది.

Ukraine Kyiv Curfew :  యుక్రెయిన్ రాజధాని కీవ్‌లో కర్ఫ్యూ.. రోడ్లపైకి ఎవరూ రావొద్దంటూ హెచ్చరిక!

Russia Ukraine Crisis Live Kyiv Imposes Intensified Curfew Amid Russian Offensive

Russia-Ukraine crisis : యుక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. రష్యాతో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రాజధాని కీవ్ నగరంలో  హైఅలర్ట్ ప్రకటించారు.  కర్ఫ్యూ విధిస్తూ కీవ్ మేయర్ ఆదేశాలు జారీ చేశారు. యుద్ధం జరుగుతున్న సమయంలో ఎవరూ కూడా రోడ్లపైకి రావొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని యుక్రెయిన్ కీవ్ మేయర్ తెలిపారు. రోడ్లపైకి వచ్చిన వారందరినీ శత్రువుగానే పరిగణిస్తామని కీవ్ మేయర్ స్పష్టం చేశారు. రష్యా బలగాలు కీవ్ నగరంలోకి చొచ్చుకుని వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఈ క్రమంలో రష్యా బలగాలు క్షిపణులను భవనాలపై ప్రయోగిస్తున్నాయి. పలు భవనాలు ఇప్పటికే ధ్వంసమయ్యాయి. కీవ్ నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో రష్యా బలగాలు నగరాన్ని చుట్టుముట్టాయి. రష్యాకు దీటుగా జవాబిచ్చేందుకు యుక్రెయిన్ బలగాలు ప్రణాళిలు సిద్ధం చేస్తున్నాయి. కీవ్ నగరం చుట్టూ కీలక పాయింట్లను యుక్రెయిన్ తమ నియంత్రణలోకి తీసుకుంది. కీవ్ నగరంపై ఇంకా పట్టును కోల్పోలేదని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. యుక్రెయిన్ సైన్యంతో పాటు నగర పౌరులు కూడా కూడా యుద్ధంలో పాల్గొనాలని జెలెన్ స్కీ పిలుపునిచ్చారు. యుద్ధం ఆగితేనే శాంతి నెలకొంటుందని జెలెన్ స్కీ తెలిపారు.

Russia Ukraine Crisis Live Kyiv Imposes Intensified Curfew Amid Russian Offensive (1)

Russia Ukraine Crisis Live Kyiv Imposes Intensified Curfew Amid Russian Offensive

మరోవైపు.. రష్యాతో యుక్రెయిన్ ఒంటరిగానే పోరాడుతోంది. ప్రపంచ దేశాలు సాయం చేసేందుకు ముందుకు రాకపోవడంతో చావోరేవో అన్నట్టుగా రష్యాపై ప్రతిఘటిస్తోంది యుక్రెయిన్.. రష్యా చర్యలను అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నించినప్పటికీ రష్యా అధ్యక్షుడు పుతిన్ వెనక్కి తగ్గలేదు. చేసేది ఏమిలేక యుక్రెయిన్ ఒకటే రష్యాను నిలువరించేందుకు తన దగ్గరి ఆయుధాలతో అడ్డుకుంటోంది. ఈ నేపథ్యంలో నాటో దేశాల్లో కదలిక మొదలైంది. ఆయుధ సాయం అందించేందుకు నాటో దేశాలు ముందుకొస్తున్నాయి.


ఆయుధాలను అందించేందుకు చెక్ రిపబ్లిక్ కూడా ముందుకొచ్చింది. తాము కూడా ఆయుధాలు పంపిస్తామని బ్రిటన్ వెల్లడించింది. మరో 20 దేశాలు కూడా యుక్రెయిన్‌కు సాయం అందించేందుకు సంసిద్ధతను ప్రకటించాయి. ఈ దేశాలు యుక్రెయిన్ తరపున రష్యాపై నేరుగా నేరుగా యుద్ధంలో పాల్గొనకపోయినా ఆయుధాలను అందించేందుకు నాటో దేశాలు ముందుకు వచ్చాయి. నాటో దేశాలు సహకారంతో యుక్రెయిన్ ఊపిరి పీల్చుకుంటోంది. నాటో దేశాలు రంగంలోకి దిగడంతో ఎక్కడిక్కడ రష్యాకు బ్రేక్ వేస్తున్నాయి. తమ తీరంలో రష్యా కార్గో నౌకను ఫ్రాన్స్ కూడా అడ్డుకుంది.

Read Also : Missile Hits Building : బుద్ధిమార్చుకోని రష్యా.. జనావాసాలపై క్షిపణి దాడి.. వీడియో