Missile Hits Building : బుద్ధిమార్చుకోని రష్యా.. జనావాసాలపై క్షిపణి దాడి.. వీడియో

యుక్రెయిన్ రష్యా మధ్య భీకరం యుద్ధ నడుస్తోంది. రష్యా ఆధిపత్యం కోసం యుద్ధ చేస్తుంటే.. యుక్రెయిన్ ఆత్మరక్షణ కోసం యుద్ధం చేస్తోంది.

Missile Hits Building : బుద్ధిమార్చుకోని రష్యా.. జనావాసాలపై క్షిపణి దాడి.. వీడియో

Missile Hits Residential Building In Ukraine Capital Kyiv

Missile Hits Building : యుక్రెయిన్ రష్యా మధ్య భీకరం యుద్ధ నడుస్తోంది. రష్యా, యుక్రెయిన్ సైన్యం నువ్వానేనా అన్నట్టుగా తలపడుతున్నాయి. రష్యా ఆధిపత్యం కోసం యుద్ధ చేస్తుంటే.. యుక్రెయిన్ ఆత్మరక్షణ కోసం యుద్ధం చేస్తోంది. రష్యా బలగాలు లోపలకు చొచ్చుకుని వస్తున్నా.. యుక్రెయిన్ సైన్యం దీటుగా ప్రతిఘటిస్తోంది.

యుక్రెయిన్ వాసులు కూడా దేశాన్ని రక్షించుకునేందుకు తమవంతు సాయంగా పోరాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో రష్యా బలగాలు క్షిపణులను ప్రయోగిస్తున్నాయి. రాజధాని నగరం కీవ్‌లోని ఓ భారీ భవనంపై రష్యా సైన్యం క్షిపణి ప్రయోగించింది. ఈ మేరకు కీవ్‌ మేయర్ విటాలీ క్లిట్ష్కో ఒక ప్రకటనలో వెల్లడించారు.

కీవ్ నగరంలో రాత్రిసమయంలో రష్యా దళాలు చొచ్చుకుని వస్తున్నాయి. యుక్రెయిన్ భవనాలపై విచక్షణ లేకుండా క్షిపణలుతో దాడులకు దిగుతోంది. ఈ నేపథ్యంలో కీవ్‌లో భయనక పరిస్థితులు నెలకొన్నాయి. కీవ్‌లోకి చొరబడేందుకు రష్యా సైన్యం అన్ని దిశలను నుంచి దాడులు చేస్తూ లోపలికి వస్తోందని మేయర్ విటాలీ క్లిట్ష్కో అన్నారు.

Missile Hits Residential Building In Ukraine Capital Kyiv (1)

Missile Hits Residential Building In Ukraine Capital Kyiv

దెబ్బతిన్న అపార్ట్‌మెంట్ ఫొటోను ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా ట్విటర్‌ అకౌంట్లో పోస్ట్‌ చేశారు. శాంతికి పేరుగాంచిన కీవ్‌ నగరం.. రష్యా బలగాలు క్షిపణుల దాడులతో వణికిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా మిస్సైల్‌ ఒకటి కీవ్‌లోని అపార్ట్‌మెంట్‌ను ఢీకొట్టిందని తెలిపారు. ఇలాంటి దాడులకు పాల్పడే రష్యాపై అంతర్జాతీయ సమాజం తీవ్రమైన ఆంక్షలు విధించాలని ఆయన డిమాండ్ చేశారు.


యుక్రెయిన్‌పై విరుచుకుపడుతున్న రష్యాను కంట్రోల్ చేద్దామనుకుంటున్న చర్యలకు అడుగు ముందుకు పడడం లేదు. రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. కాసేపటి క్రితమే U.N.S.C అత్యవసర సమావేశంలో రష్యా చర్యలపై మండలిలో ఓటింగ్ నిర్వహించింది. యుక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ అమెరికా చేసిన ప్రతిపాదనపై 11 ఓట్లు అనుకూలంగా వచ్చాయి. అయితే ఈ ఓటింగ్ ప్రక్రియలో భారత్, చైనాలు దూరంగా ఉన్నాయి. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వమున్న రష్యా.. వీటో పవర్ సాయంతో తీర్మానాన్ని రద్దు చేయించుకుంది.

Read Also : UN Security Council : యుఎన్ భద్రతా మండలి అంటే ఏంటి? యుక్రెయిన్‌పై రష్యా దాడిని ఎలా అడ్డుకోగలదు?