Russia-Ukraine War:‘మీరు టిక్ టాక్ స్టార్ కదా’..యుక్రెయిన్ అధ్యక్షుడిని ప్రశ్నించిన యువతి..జెలెన్ స్కీ ఏమన్నారోతెలుసా?!

‘మీరు టిక్ టాక్ స్టార్ కదా’..యుక్రెయిన్ అధ్యక్షుడిని ప్రశ్నించిన యువతి..జెలెన్ స్కీ ఏమన్నారోతెలుసా?!

Russia Ukraine War

Russia-Ukraine War రష్యాతో నువ్వా? నేనా? అన్నట్లుగా దాదాపు 25 రోజుల నుంచి యుద్ధం చేస్తున్న ఓ దేశాధ్యక్షుడిని పట్టుకుని ఓ సాధారణ యువతి ఎంత మాట అనేసింది?! రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఏమాత్రం లొంగకుండా పోరాడుతున్న యుక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీని పట్టుకుని ఓ యువతి ‘మీరు టిక్ టాక్ స్టార్’కదూ? అని అడిగేసింది. దీంతో జెలెన్ స్కీ కాసేపు నివ్వెరపోయారు. అంతలోనే తేరుకుని ఆ యుద్ధంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సదరు యువతికి పూల బొకే ఇచ్చి మరీ పరామర్శించారు.

Also read : Russian Missiles : యుక్రెయిన్‌లో ఎయిర్‌క్రాఫ్ట్ రిపేర్ ప్లాంట్‌పై రష్యా క్షిపణుల దాడి..!

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine War) హోరాహోరీగా సాగుతూ రోజురోజుకు తీవ్రతరమవుతోంది. రష్యా ఎన్ని అస్త్రాలు ప్రయోగిస్తున్నా విధ్వంసం, వినాశనం సృష్టిస్తున్నా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ మాత్రం ఏమాత్రం తగ్గేదేలేదు అంటున్నారు. శక్తి మేరకు పోరాడుతున్నారు. రష్యా యుద్ధం ఎంత తీవ్ర తరం చేసినా జెలెన్ స్కీ(Zelensky) మాత్రం పట్టు సడలించడం లేదు.వెనక్కి తగ్గటంలేదు. అందంగా ఉండే తమ దేశం శిథిలంలా మారిపోతున్నా ఏమాత్రం తగ్గటంలేదు.

Also read : America : చైనాకు అమెరికా స్ట్రాంగ్‌ వార్నింగ్.. ‘రష్యాకు సాయం చేస్తే తీవ్ర పరిణామాలు’

దేశం కోసం తుది శ్వాస ఆగిపోయోంతవరకూ పోరాడతానని చెబుతున్నారు. ఈ క్రమంలో రష్యా దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ యువతి (టీనేజర్)అడిగిన ప్రశ్నకు ఆయన షాక్ కు గురయ్యారు. కీవ్ సమీపంలోని వోర్జెల్(Worgel) పట్టణంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను జెలెన్ స్కీ తాజాగా పరామర్శించారు. ఈ క్రమంలో అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ బాలిక వద్దకు వెళ్లిన జెలెన్ స్కీ తెల్లటిపువ్వులున్న ఫ్లవర్ బొకే ఇచ్చారు.

Also read : Russia-Ukrainian War : పుతిన్ యుద్ధంలో ఎంతమంది యుక్రేనియన్లు, రష్యన్లు మరణించారో తెలుసా?

అయితే.. ఆ బాలిక మాత్రం ‘‘మీరు టిక్ టాక్ స్టార్ కదా! మీకు చాలా మంది టిక్ టాక్ లో మద్దతిస్తున్నారు. అందరూ మీ గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రతి విషయం మీ గురించే’’ అంటూ చెప్పింది. ఆ అమ్మాయి మాటలను సరదాగా తీసుకున్న జెలెన్ స్కీ.. ‘‘అంటే, మేం టిక్ టాక్ ను ఆక్రమించేశామన్నమాట’’ అంటూ నవ్వుతూ కామెంట్ చేయటం గమనించాల్సిన విషయం.