Prince Philip Death: ప్రిన్స్ ఫిలిప్ (99) ఇకలేరు

బ్రిటన్ రెండో ఎలిజబెత్ రాణి భర్త ప్రిన్స్ ఫిలిప్ (99) కన్నుమూశారు. ప్రిన్స్ ఫిలిప్ మృతిపై బకింగ్ హామ్ ప్యాలెస్ వర్గాలు ప్రకటించాయి.

UK’s Prince Philip Death : బ్రిటన్ రెండో ఎలిజబెత్ రాణి భర్త ప్రిన్స్ ఫిలిప్ (99) కన్నుమూశారు. ప్రిన్స్ ఫిలిప్ మృతిపై బకింగ్ హామ్ ప్యాలెస్ వర్గాలు ప్రకటించాయి. బ్రిటన్ రాయల్ ఫ్యామిలీలో ఒకరైన ది డ్యుక్ ఆఫ్ ఎడిన్ బర్గ్ వైండ్ సోర్ క్యాస్టెల్ లో ఉదయం ప్రశాంతంగా కన్నుమూసినట్టు ప్రకటించింది. ప్రిన్స్ ఫిలిప్ బ్రిటీష్ చక్రవర్తిగా ఎక్కువ కాలం పనిచేశారు. ఎలజిబిత్ రాణికి మద్దతుగా 69 సంవత్సరాలు పనిచేశాడు.

2017లో రాయల్ సర్వీసు నుంచి డి రిటైర్ అయ్యాడు. ప్రిన్స్ ఫిలిప్, డ్యూక్ ఆఫ్ ఎడిన్ బర్గ్ మరణాన్ని ప్రకటించడంతో ఎలిజబెత్ రాణి తీవ్ర దు:ఖంలో మునిగిపోయారు. గత కొన్నేళ్లుగా అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రిన్స్ ఫిలిప్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో లండన్‌లోని ఆసుపత్రిలో చేరారు. నాలుగు వారాల చికిత్స తర్వాత మార్చి 16న డిశ్చార్జ్‌ అయ్యారు.


గుండె సంబంధిత ఆపరేషన్ తర్వాత కోలుకుని ప్యాలెస్‌కు చేరుకున్నారు. అయితే ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచినట్లు బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ ప్రకటించింది. విండ్సర్‌ క్యాస్టిల్‌లో ఈ ఉదయం ఆయన ప్రశాంతంగా కన్నుమూసినట్లు పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు