విమానంలో మంటలు… పైలట్ల సమయస్ఫూర్తితో తప్పిన పెను ప్రమాదం

United Airlines Flight engine catches fire, midair before landing, engine failure : విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో నిన్న విమానప్రమాదం తప్పిన ఘటన మర్చిపోకముందే అమెరికాలోని విమానంలో మంటలు వ్యాపించాయి. పైలట్ల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పి…ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారు.

అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంనుంచి బోయింగ్ 777-200 విమానం 231 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బందితో శనివలారం హోనొలులు బయలు దేరింది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే రెండో ఇంజన్ లో సాంకేతిక లోపం తలెత్తింది. విమానంలో మంటలు చెలరేగి విమాన భాగాలు విరిగి కింద పడ్డాయి.

బ్రూమ్‌ఫీల్డ్‌, కొలరాడోలోని పలు నివాస ప్రాంతాల్లో ఇంజిన్‌ కౌలింగ్‌, టర్ఫ్‌ ఫీల్డ్‌లోని భాగాలను అధికారులు గుర్తించారు. అలాగే విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలను వీడియో తీసిన ప్రయాణికుడు సోషల్‌ మీడియాలో వైరల్ చేశాడు.


అగ్నిప్రమాద ఘటనపై యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ స్పందించింది. విమాన సిబ్బంది చొరవతో ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని తెలిపింది. ‘ డెన్వర్‌ విమానాశ్రయం నుంచి యూనైటెడ్‌ ఫ్లైట్‌ 328 విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఇంజన్‌లో మంటలు చెలరేగాయి.

పైలట్లు అప్రమత్తమై విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇప్పటి వరకు తెలియరాలేదు.కారణాలు తెలుసుకునేందు ఎఫ్‌ఏఏ(FAA), ఎన్‌టీఎస్‌బీ(NTSB)తో విచారణ జరిపిస్తున్నాం’అని యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్ ట్వీట్‌ చేసింది.

ట్రెండింగ్ వార్తలు