Flight : టేకాఫ్ సమయంలో ఊడిన విమానం టైరు.. ఆ తరువాత ఏమైందంటే? వీడియో వైరల్

విమానంలో 235 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బంది ఉన్నారు.

Flight

United Airlines flight Viral Video: యునైటెడ్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 777  విమానంకు పెద్ద ప్రమాదం తప్పింది. శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జపాన్ లోని ఒసాకాకు బయల్దేరిన విమానం.. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వెనుక భాగంలో ల్యాండింగ్ గేర్ లోని ఓ టైరు ఊడిపోయింది. టైరు ఊడిపోయిన విషయాన్ని గుర్తించిన పైలట్లు విమానాన్ని దారిమళ్లించి లాస్ ఏంజిల్స్ ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ కు ప్రయత్నించారు. ఈ సమయంలో విమానంలోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ల్యాండింగ్ సమయంలో ఏం జరుగుతుందోనని ఊపిరిబిగబట్టుకున్నారు. ఈ విమానంలో 235 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బంది ఉన్నారు.

Car Damaged

లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు అగ్నిమాపక యంత్రాలను అందుబాటులో ఉంచారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు చర్యలు చేపట్టారు. దీంతో బోయింగ్ 777 విమానం రన్ వేపై నెమ్మదిగా ల్యాండ్ అయింది. సురక్షితంగా విమానం ల్యాండ్ కావడంతో ప్రయాణికులతో పాటు విమానాశ్రయ సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.

ఇదిలాఉంటే విమానం గాల్లో ఉండగానే ఊడిన టైరు నేరుగా వెళ్లి విమనాశ్రయంలోని పార్కింగ్ లాట్ లో ఉన్న కారుపై పడింది. ఈ ఘటనలో కారు ధ్వసమైంది. కారు మధ్య, ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. కారులో ఎవరూ లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. అయితే, విమానం నుంచి టైరు ఊడి కిందపడుతున్న ‘సమయంలో , కారు దెబ్బతిన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు చేస్తుంది.

Also Read : Air India : మరో వివాదంలో ఎయిరిండియా.. మహిళా ప్రయాణికురాలిని విమానం నుంచి దింపేసింది!