Air India : మరో వివాదంలో ఎయిరిండియా.. మహిళా ప్రయాణికురాలిని విమానం నుంచి దింపేసింది!

Air India Deboarded : మహిళా ప్రయాణికులరాలిని విమానం నుంచి దింపేసిన ఘటనతో మరోసారి ఎయిర్ ఇండియా వివాదంలో చిక్కుకుంది. అసలేం జరిగిందంటే?

Air India : మరో వివాదంలో ఎయిరిండియా.. మహిళా ప్రయాణికురాలిని విమానం నుంచి దింపేసింది!

Air India deboards ‘rude’ head of a financial company

Air India Deboarded Woman Passenger : ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియాను వివాదాలు వెంటాడుతున్నాయి. తరచూ ఏదో ఒక వివాదంలో ఎయిరిండియా చిక్కుకుంటూనే ఉంది. తాజాగా ఓ మహిళా ప్రయాణికురాలిని విమానం నుంచి దింపేసి మరో వివాదంలో చిక్కుకుంది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Read Also : Pawan Kalyan : అలాంటి వారి కోసమే నేను రాజకీయాల్లో కొనసాగుతున్నా- పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

అసలేం జరిగిందంటే.. ఈ నెల 5న ఢిల్లీ నుంచి లండన్‌కు వెళ్లే ఏఐ 161 విమానంలో ఓ మహిళ ఎక్కింది. అయితే, ఆమె కేబిన్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడంతో విమానం నుంచి దింపేశారు. ఒక కంపెనీలో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసే ప్రయాణికురాలు బిజినెస్‌ క్లాస్‌లో కొనుగోలు చేసింది. కొద్దిసేపట్లో విమానం టేకాఫ్ కానుంది.

మరో విమానంలో ఆమెను పంపేశాం : ఎయిరిండియా 
అంతలోనే ఆమె కేబిన్ సిబ్బందితో ఏదో విషయంలో వాగ్వాదానికి దిగింది. దాంతో పైలట్ ఆ ప్రయాణికురాలిని విమానం నుంచి దింపేయాలని సూచించినట్టు ఎయిరిండియా అధికార ప్రతినిధి తెలిపారు. మహిళా ప్రయాణికురాలిని దించేసిన తర్వాత విమానం (AI-161) గంట ఆలస్యంగా బయలుదేరింది. కానీ, దింపేసిన మహిళను రాతపూర్వక హామీతో మరో విమానంలో లండన్ పంపించినట్టు ఎయిరిండియా వెల్లడించింది.

డీజీసీఏ నివేదిక ప్రకారం.. 2024 జనవరిలో వేలాది మంది ప్రయాణికులను వేర్వేరు కారణాలతో ఎయిరిండియా దింపేసింది. అనంతరం బాధిత ప్రయాణకులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసింది. గతంలో ఎయిరిండియా సిబ్బంది కారణంగా ఒక వృద్ధుడు వీల్ ఛైర్ అందుబాటులో లేక కుప్పకూలిపోయాడు. ఈ ఘటనపై స్పందించిన డీజీసీఏ ఎయిరిండియాకు రూ. 30లక్షల జరిమానా కూడా విధించింది.

Read Also : Mahesh Babu : మహేష్ బాబు కొత్త లుక్ చూసారా.. లేజర్ ఫోకస్ అంటూ..