Weapons Manufactured : మయన్మార్ లో పెద్ద ఎత్తున ఆయుధాలు తయారీ.. ఐక్యరాజ్య సమితి నివేదిక

మయన్మార్ లో పెద్ద ఎత్తున ఆయుధాలు తయారవుతున్నట్లు ఐక్య రాజ్య సమితి నివేదికలు వెల్లడిస్తున్నాయి. మయన్మార్ సైన్యం ప్రస్తుతం ఎలాంటి యుద్ధం చేయడం లేదని.. అయినప్పటికీ అక్కడ ఆయుధాలు పెద్ద ఎత్తున తయారవుతున్నట్లు తెలిపింది.

Weapons Manufactured : మయన్మార్ లో పెద్ద ఎత్తున ఆయుధాలు తయారవుతున్నట్లు ఐక్య రాజ్య సమితి నివేదికలు వెల్లడిస్తున్నాయి. మయన్మార్ సైన్యం ప్రస్తుతం ఎలాంటి యుద్ధం చేయడం లేదని.. అయినప్పటికీ అక్కడ ఆయుధాలు పెద్ద ఎత్తున తయారవుతున్నట్లు తెలిపింది. ప్రజాస్వామ్య అనుకూల మయన్మార్ తన దేశ వాసులను చంపేందుకు ఆయుధాలను వేగంగా పెంచుకుంటుందని ఆ నివేదిక వెల్లడించింది. మయన్మార్ పై ప్రస్తుతం పలు దేశాలు ఆంక్షలు విధించాయి.

ఆయుధాలు కొనుగోలు చేసుకునే వీలు లేకపోవడంతో తయారీపై ఆ దేశం దృష్టి సారించింది. ఆయుధాల తయారీ పనిలో భారత్, అమెరికా, జపాన్ సహా 13 దేశాలకు చెందిన కంపెనీలు మయన్మార్ కు మద్దతుగా నిలుస్తున్నాయని ఐక్యరాజ్య సమితి నివేదిక తెలిపింది. యూఎన్ నివేదిక ప్రకారం ఆస్ట్రియా కంపెనీ జీఎఫ్ఎం స్ట్రెయిన్ నుంచి ఆయుధాల తయారీలో మయన్మార్ అత్యధిక సాయం పొందుతోంది.

Myanmar Military attack:మయన్మార్ లో మారణహోమం..చేతులు కట్టేసి..11మందిని సజీవ దహనం చేసిన మిలటరీ బలగాలు

దీనిపై వివరణ కోరగా ఆస్ట్రియన్ కంపెనీ నిరాకరించింది. చైనా, సింగపూర్ నుంచి ముడి సరుకు కొనగోలు చేస్తున్నారు. భారత్-రష్యా కంపెనీ నుంచి ఫ్యూజులు, ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు అందుతున్నాయి. జర్మనీ, జపాన్, యుక్రెయిన్, అమెరికా నుంచి యంత్రాలు వస్తున్నాయి. ఇలా పలు కంపెనీలు మయన్మార్ కు సాయం చేయడంలో సింగపూర్ మధ్యవర్తిగా వ్యవహిరిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు