Myanmar Military attack:మయన్మార్ లో మారణహోమం..చేతులు కట్టేసి..11మందిని సజీవ దహనం చేసిన మిలటరీ బలగాలు

ప్రభుత్వానికి వ్యతిరేకింగా ఆందోళన చేసినవారిపై మయన్మార్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. దీంట్లో భాగంగానే 11మందిని చేతులు కట్టేసి నిప్పు పెట్టి సజీవ దహనం చేశారు.

Myanmar Military attack:మయన్మార్ లో మారణహోమం..చేతులు కట్టేసి..11మందిని సజీవ దహనం చేసిన మిలటరీ బలగాలు

Myanmar Military Attack

Myanmar Military attack: ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపిస్తే చాలు మిలటరీ వారి గొంతులు నులిమేస్తోంది మయన్మార్​ సైన్యం. మాట బయటకు రాకుండా ఉక్కుపాదం మోపుతోంది. సామాన్యపౌరులపై మిలటరీ దారుణాలకు పాల్పడుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిసనలు చేస్తున్నవారిపై మిలటరీ అధికారులు కిరాతకంగా వ్యవహరిస్తున్నారు. ఉగ్రవాదుల్ని తలపించేలా వ్యవహరిస్తు..సామాన్యుల ప్రాణాల్ని నిలువునా తీసేస్తున్నారు. దీంట్లో భాగంగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారిపై మిలటరీ దళాలు విరుచుకుపడ్డాయి. మిలిటరీ కాన్వాయ్​పై దాడి చేశారనే కోపంతో ప్రజల్ని కాపాడాల్సిన సైన్యమే హత్యలకు పాల్పడుతోంది. ఓ గ్రామాన్ని చుట్టుముట్టి 11 మంది సామాన్య పౌరులను సజీవ దహనం చేసారు మిలటరీ బలగారు. మయన్మార్ సైన్య 11మంది పౌరుల్ని చేతులు కట్టేసి సజీవ దహనం చేసారని ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఒక గుడిసె అవశేషాల మధ్య వృత్తాకారంలో పడి ఉన్న 11 మంది కాలిపోయిన మృతదేహాలను చూపించింది.

Read more : Aung San Suu Kyi: ఆంగ్ సాన్ సూకీకు నాలుగేళ్ల జైలు శిక్ష

గత మంగళవారం (డిసెంబర్ 7,2021) మయన్మార్​ వాయవ్య ప్రాంతంలోని సాగేంగ్​ పరిధిలోని డన్​ టావ్​​ గ్రామంలో ప్రభుత్వ బలగాలు విరుచుకుపడ్డాయి. ఓ మిలిటరీ కాన్వాయ్​పై దాడి చేశారనే కోపంతో 11 మంది పౌరులను చేతులు కట్టేసి సజీవ దహనం చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు..వీడియోలో సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి.

సజీవ దహనం అయినవారిలో కొందరు యువకులతో పాటు మొత్తం 11మంది మృతదేహాలు కాలిపోయి..వృత్తాకారంలో పడి ఉన్నాయి. వారంతా 14 నుంచి 40 ఏళ్లవారిగా తెలుస్తోంది. 2020 ఫిబ్రవరిలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి.. అధికారాన్ని చేజిక్కించుకున్న సైన్యం ప్రజలపై ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్న వారిని అణచివేసేందుకు చేస్తున్న మిలిటరీ దాడులకు నిదర్శనంగా నిలుస్తున్నాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

Read more : Brigadier Lakhwinder Singh Lidder : భర్త శ‌వ‌పేటిక‌ను ముద్దాడిన బ్రిగేడియ‌ర్ ల‌ఖ్వింద‌ర్‌సింగ్ లిద్ద‌ర్ భార్య‌..

దీంట్లో భాగంగానే గత మంగళవారం ఉదయం 11 గంటలకు 50 మంది సైనికులు డన్​ టావ్​​ గ్రామంలోకి ప్రవేశించారు. ఎవరూ పారిపోకుండా అన్ని దారులను మూసివేశారు. 11 మంది అమాయక పౌరులను పట్టుకున్నారు. వారి చేతులను వెనక్కి కట్టేసి, నిప్పు అంటించి సజీవంగా దహనం చేశారు. ఇస్లామిక్​ స్టేక్​ ఉగ్రవాదుల క్రూరత్వాన్ని ఈ ఘటన ప్రతిబింబిస్తోందని మీడియా పేర్కొంది.మయన్మార్​ మిలిటరీ ప్రభుత్వం చేపడుతున్న అరాచకాలను అడ్డుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చాయి పలు మానవ హక్కుల సంఘాలు.