Aung San Suu Kyi: ఆంగ్ సాన్ సూకీకు నాలుగేళ్ల జైలు శిక్ష
ప్రతిపక్ష నాయకురాలు ఆంగ్ సాన్ సూకీకు మయన్మార్ కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధిచింది. మిలటరీ పాలనలో అక్రమాలు, కొవిడ్-19 ప్రొటోకాల్స్ బ్రేక్ చేసినందుకు గానూ ఆమెకు శిక్ష విధించి....

Aung San Suu Kyi
Aung San Suu Kyi: మయన్మార్ ప్రతిపక్ష నాయకురాలు ఆంగ్ సాన్ సూకీకి ఆ దేశ కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. మిలటరీ పాలనలో అక్రమాలు, కొవిడ్-19 ప్రొటోకాల్స్ బ్రేక్ చేసినందుకు గానూ ఆమెకు శిక్ష విధించినట్లు తెలిపింది. 2021 ఫిబ్రవరి1న ఆమె అరెస్ట్ అయిన తర్వాత.. గత మంగళవారం తొలి సారి తీర్పు వెలువడింది.
సూకీపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయి. నాలుగేళ్ల జైలు శిక్ష తర్వాత ఆ నేరాలు కూడా రుజువైతే జీవితకాలం జైలు జీవితమే గడపాల్సి రావొచ్చు.
ఆమెపై ఉన్న అభియోగాలేంటి?
లైసెన్స్ లేని వాకీ టాకీలు ఉపయోగించడం, సిగ్నల్ జామర్స్ అనుమతి లేకుండా వాడటం, 2020 ఎన్నికల్లో కరోనావైరస్ నిబంధనలు ఉల్లంఘించడం వంటి ఆరోపణలు సూకీపై ఎన్నో ఉన్నాయి. ఆ తర్వాత మిలటరీ ఆమెపై మరిన్ని ఫిర్యాదులు లేవనెత్తింది.
…………………………………: భీమ్ వచ్చేస్తున్నాడు.. కౌంట్ డౌన్ స్టార్ట్!
సూకీపై ఎలక్టోరల్ మోసం, దేశద్రోహం, బ్రిటీష్ కాలం నాటి రహస్య చట్టాల ఉల్లంఘన వంటి ఆరోపణలున్నాయి. 11 కిలోల బంగారాన్ని, 6 లక్షల డాలర్లను సూకీ అక్రమంగా పొందారని యాంగోన్ రీజియన్ చీఫ్ మినిస్టర్ ఆరోపించారు.
ఆంగ్ సన్ సూకీ ఎవరు?
సూకీ నేతృత్వంలో ఎన్ఎల్డీ పార్టీ 2015లో విజయం సాధించింది. 25ఏళ్ల తర్వాత తొలి డెమోక్రటిక్ ఓట్ ఆమెదే. 1989 నుంచి 2012 మధ్యకాలంలో 15ఏళ్ల పాటు ఆమె హౌజ్ అరెస్టులోనే ఉన్నారు. అంతేకాదు.. 1991లో ఆమె ప్రజాస్వామ్యం గురించి చేస్తున్న పోరాటానికి గానూ నోబెల్ శాంతి బహుమతితో సత్కరించారు.
………………………………..: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌కు రెండేళ్లు