Variant Factories: వ్యాక్సిన్ వేయించుకోనివారే కొత్త వేరియంట్ ఫ్యాక్టరీలు.. వీరితోనే ప్రమాదం పెరుగుతోంది

వ్యాక్సినేషన్ చేయించుకోని వ్యక్తులు తమ సొంత ఆరోగ్యాన్ని పణంగా పెట్టడమే కాదు.. తోటివారికి కూడా ప్రమాదకారులుగా మారుతున్నారు.

Unvaccinated people: వ్యాక్సినేషన్ చేయించుకోని వ్యక్తులు తమ సొంత ఆరోగ్యాన్ని పణంగా పెట్టడమే కాదు.. తోటివారికి కూడా ప్రమాదకారులుగా మారుతున్నారు. వ్యాక్సినేషన్ చేయించుకోనివారు కరోనావైరస్ బారిన పడితే అందరికీ ప్రమాదకారులుగా మారుతున్నారని అంటు వ్యాధి నిపుణులు అంటున్నారు.

క్రొత్త కరోనావైరస్ మ్యూటేషన్స్‌కు ఏకైక మూలం వ్యాక్సిన్ వేయించుకోని కరోనా సోకిన వ్యక్తి శరీరం. వాండర్‌బిల్ట్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్‌లోని అంటు వ్యాధుల విభాగంలో ప్రొఫెసర్ డాక్టర్ విలియం షాఫ్‌నర్ శుక్రవారం సిఎన్‌ఎన్‌తో మాట్లాడుతూ.. “వ్యాక్సినేషన్ చేయించుకోని వ్యక్తులు కొత్త కరోనా వేరియంట్‌లు తయారుచేసే ఫ్యాక్టరీలుగా మారుతున్నారు” అని చెప్పారు.

వ్యాక్సినేషన్ చేయించుకోని వ్యక్తులే కొత్త వేరియంట్లను తయారుచేసే వ్యక్తులుగా మారుతున్నారని, వైరస్ పెంచుతున్న వ్యక్తుల్లో ఎక్కువ వ్యాక్సినేషన్ చేయించుకోనివారేనని ప్రొఫెసర్ షాఫ్‌నర్ చెప్పుకొచ్చారు. వ్యాక్సినేషన్ చేయించుకోనివారిలో కరోనా కొత్త వేరియంట్లు పుడుతున్నాయని, కరోనా సోకినప్పుడు, వారి శరీరంలో మరింత తీవ్రంగా ఉండే వేరియంట్ తయారవుతుందని, వారి ద్వారా సోకిన వ్యక్తుల నుంచి ప్రభావం తీవ్రం అవుతుందని చెప్పారు.

సాధారణంగా అన్నీ వైరస్‌లు పరివర్తనం చెందుతాయి. కరోనావైరస్ ముఖ్యంగా మ్యుటేషన్-బారిన పడకపోయినా, అది మారుతూ ఉంటుంది. అభివృద్ధి చెందుతుంది. శరీరంలో జరిగే మార్పులు వైరస్‌కు అర్ధంకావు. కొన్ని దానిని బలహీనపరుస్తాయి. కానీ కొన్నిసార్లు, ఒక వైరస్ యాదృచ్ఛిక మ్యుటేషన్‌ను అభివృద్ధి చేస్తుంది.

వ్యాక్సినేషన్ చేయించుకున్న వ్యక్తుల్లో ఈ వైరస్‌లు అభివృద్ధి చేసే పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది. కొత్త మ్యూటేషన్లు తయారయ్యే పరిస్థితి కూడా తక్కువే. రోగనిరోధక శక్తి ఉన్నవారికి సోకడానికి కొత్త వేరియంట్లు ప్రయత్నించినా విఫలం కావచ్చు, లేదా విజయవంతం కావచ్చు. తేలికపాటి లేదా లక్షణాలు లేని కరోనా శరీరంలోకి ఎంటర్ అవ్వచ్చు. కానీ వ్యాక్సినేషన్ చేయించుకున్న వ్యక్తుల్లో మాత్రం కచ్చితంగా ప్రభావం తక్కువగా ఉంటుంది అని స్పష్టం చేస్తున్నారు నిపుణులు.

ట్రెండింగ్ వార్తలు