Upside Down Railway : ట్రాక్ కింద వేలాడుతూ..త‌ల‌కిందులుగా ప్ర‌యాణించే రైళ్లు..! చూడాలన్నా..ప్రయాణించాలన్నా అక్కడికి వెళ్లాల్సిందే..

బస్సులు, కార్లు, స్కూటర్లు లారీలు ఇటువంటి వాహనాలు అన్నీ రోడ్లమీద నడుస్తాయి. అదే విమానం..హెలికాప్టర్ అయితే గాలిలో ఎగురుతాయి. మరి రైళ్లు ఎక్కడ నడుస్తాయి? అని అడిగితే.. ట్రాకులమీద నడుస్తాయి అని ఎవ్వరైనా సరే ఠక్కున చెప్పేస్తారు. కానీ కొన్ని చోట్ల రైళ్లు మాత్రం ట్రాకులమీదే నడుస్తాయి కానీ..రైల్వే ట్రాక్ కింద నడుస్తాయి గాల్లో వేలాడుతూ నడుస్తాయి..!

Upside Down Railway In Germany's Wuppertal (2)

Upside down railway in Germany’s Wuppertal : బస్సులు, కార్లు, స్కూటర్లు లారీలు ఇటువంటి వాహనాలు అన్నీ రోడ్లమీద నడుస్తాయి. అదే విమానం..హెలికాప్టర్ అయితే గాలిలో ఎగురుతాయి. మరి రైళ్లు ఎక్కడ నడుస్తాయి? అని అడిగితే..ఏంటీ జోకా రైళ్లు ట్రాకులమీద నడుస్తాయి అని ఎవ్వరైనా సరే ఠక్కున చెప్పేస్తారు. కానీ కొన్ని చోట్ల రైళ్లు మాత్రం ట్రాకులమీదే నడుస్తాయి కానీ..రైల్వే ట్రాక్ కింద నడుస్తాయి గాల్లో వేలాడుతూ నడుస్తాయి..! ఏంటీ ట్రాకు క్రిందా? వేలాడుతూ నడుస్తాయా? అదేంటీ అదేమన్నా సైన్స్ ఫిక్షన్ సినిమానా? అనే పేద్ద డౌటనుమానం రానే వస్తుంది. కానీ అదేం కాదు అదేం సినిమా కాదు నిజంగానే..అంటే రీల్ లో కాదు రియల్ గా రైళ్లు ట్రాకుల క్రింద వేళ్లాడుతు నడుస్తాయి..! అటువంటి వింత రైళ్లను చూడాలంటే జర్మనీ,జపాన్లకు వెళ్లాల్సిందే.

చాలామంది రైలు ప్ర‌యాణం చేసి ఉంటాం. అయితే..జ‌పాన్‌, జ‌ర్మ‌నీకి వెళ్తే ఇక్క‌డ త‌ల‌కిందులుగా ప్ర‌యాణించే రైళ్లు మ‌న‌ల్ని అత్యంత ఆశ్చర్యాలకు గురిచేస్తాయి. అక్కడ రైళ్లు ఒక ట్రాక్ కింద వేలాడుతూ రైళ్లు రోడ్లు, నదులు, ఇతర నిర్మాణాల మీదుగా నడుస్తుంటాయి. ఈ రైల్వే వ్య‌వ‌స్థ ఎప్ప‌టినుంచో ఉన్నా ‘నౌ దిస్’ న్యూస్ ఆన్‌లైన్‌లో షేర్ చేసిన క్లిప్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైర‌ల్‌గా మారింది.


ఈ క్లిప్‌లో జర్మనీలోని వుప్పర్టల్‌లో తలక్రిందులుగా ఉన్న రైల్వేల‌ను చూపించారు. ఈ వీడియో చూస్తుంటే అచ్చం సైన్స్ ఫిక్ష‌న్ సినిమా న‌వ‌లల్లో చూసినట్లుగా ఉంటుంది. ఇంజినీర్‌ యూజెన్ లాంగెన్ తన చక్కెర కర్మాగారంలో వస్తువులను తరలించేందుకు సస్పెన్షన్ రైల్వేతో ప్రయోగాలు చేశారు. 1893లో అతను తన సస్పెన్షన్ రైల్వే వ్యవస్థను నగరానికి అందించాడు. అప్ప‌టినుంచీ న‌గ‌రంలో ఈ రైళ్లు న‌డుస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ రైళ్లు ప్రతిరోజూ 82,000 మందిని వివిధ ప్రాంతాల‌కు చేర‌వేస్తున్నాయి.