హాయిగా ఎంజాయ్ చేద్దామని అమెరికాలోని కాలిఫోర్నియాలోని నాట్ బెర్రీ ఫార్మ్ పార్క్‌కు వెళ్లిన 22 మంది పర్యాటకులు సోల్ స్పిన్ రైడ్‌లో చిక్కుకుపోయారు. గాల్లోనే ఉండిపోయి భయంతో వణికిపోయారు.
స్పిన్ రైడ్ నుంచి కిందకు దిగలేక, అందులోనే ఉండలేక సతమతమయ్యారు. కొన్ని గంటల పాటు అందులోనే ఉండిపోయారు. చివరకు వారిని క్రేన్ల సాయంతో కిందకు దింపారు. అదృష్టవశాత్తూ వారెవరికీ ఎలాంటి గాయాలూ, ఆరోగ్య సమస్యలు ఎదురుకాలేదు. అయితే, ఇద్దరు మహిళా పర్యాటకులను మాత్రం ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు.
సోల్ స్పిన్ రైడ్‌లో వారు ఇరుక్కుపోయిన సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పార్క్ నిర్వాహకులు కనీస జాగ్రత్త చర్యలు తీసుకోకుండా పర్యాటకులకు స్పిన్ రైడ్‌లో ఎలా కూర్చోబెట్టారంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
Errabelli Dayakar Rao: నాపై రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారు: ఎర్రబెల్లి