Errabelli Dayakar Rao: నాపై రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారు: ఎర్రబెల్లి
రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి అని ఎర్రబెల్లి అన్నారు. తెలంగాణ కోసం రేవంత్ ఏ పోరాటం చేశారో చెప్పాలని నిలదీశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లపై మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఫైర్ అయ్యారు. ఇవాళ ఎర్రబెల్లి వరంగల్‌లో పలువురు బీఆర్ఎస్ నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.
తనపై రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎర్రబెల్లి చెప్పారు. ప్రజల కోసం తాను చేసినన్ని పనులు రేవంత్ చేశారా? అని ఎర్రబెల్లి అన్నారు. అబద్ధాలతో, మోసపూరిత మాటలతో రేవంత్ అధికారంలోకి వచ్చారని చెప్పారు.
వరంగల్ సభలో రేవంత్ అన్నీ అబద్ధాలే మాట్లాడారని తెలిపారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి అని ఎర్రబెల్లి అన్నారు. తెలంగాణ కోసం రేవంత్ ఏ పోరాటం చేశారో చెప్పాలని నిలదీశారు. కాళోజీ బతికున్నప్పుడు ఎప్పుడైనా రేవంత్ కలిశారా అని ఎర్రబెల్లి అడిగారు. కాళోజీ భవనాన్ని ఎవరు నిర్మించారని ప్రశ్నించారు. కాళోజీ భవన స్థలాన్ని కాంగ్రెస్ నేతలు కబ్జా చేస్తే తాము విడిపించామని చెప్పారు.