Donald Trump and Kamala Harris
US Elections Results 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఈ ఫలితాల్లో డొనాల్డ్ ట్రంప్ హవా కొనసాగుతోంది. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లకుగాను.. ఇప్పటి వరకు 288 ఎలక్టోరల్ ఓట్ల ఫలితాలు వెల్లడయ్యాయి. 198 ఎలక్టోరల్ ఓట్లను రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ గెలుచుకోగా.. 99 ఎలక్ట్రోరల్ ఓట్లను డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ 99 గెలుచుకుంది. ఇదిలాఉంటే.. 18 రాష్ట్రాల్లో ట్రంప్ హవా కొనసాగుతుంది. మధ్యాహ్నం వరకు పూర్తిస్థాయి ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.
Also Read: US Elections 2024 : కమలా హారిస్ vs డొనాల్డ్ ట్రంప్.. అమెరికా ఎన్నికల్లో ఎవరు గెలుస్తున్నారు?
నార్త్ డకోటా, వయో మింగ్, సౌత్ డకోటా, నెబ్రాస్కా, ఒక్లాహోమా, టెక్సాస్, ఆర్కాన్స్, లుసియాన, ఇండియానా, టెన్నేసి, కేంటకి, మిస్సోరి, మిసిసిపి, ఒహాయో, వెస్ట్ వర్జీనియా, అలబామా, సౌత్ కరోలినా, ఫ్లోరిడా రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్ రిపబ్లిక్ పార్టీ ఆధిక్యంలో ఉండగా.. తొమ్మిది రాష్ట్రాల్లో.. ఇలినోయి, న్యూజెర్సీ, మేరీ ల్యాండ్, వర్మాంట్, న్యూయార్క్, కనెక్టికట్, డేలవేర్, మసాచుసెట్స్, రోడ్ ఐలాండ్ రాష్ట్రాల్లో 99సీట్లను కమలా హరిస్ డెమోక్రటిక్ పార్టీ గెలుచుకుంది. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ కొనసాగుతుంది. పోలింగ్ ముగిసిన రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది.
రాష్ట్రాల వారిగా ఓట్ల వివరాలు..
మిసిసిపిలో ట్రంప్ నకు 62.2 శాతం, కమలా హరిస్ కు 36.6శాతం ఓట్లు.
నార్త్ డకోటాలో ట్రంప్ నకు 68.5 శాతం, కమలా హరిస్ కు 29.6 శాతం ఓట్లు
నెబ్రాస్కాలో ట్రంప్ నకు 49.3శాతం, కమలా హరిస్ కు 49.6 శాతం ఓట్లు
న్యూ హ్యాంప్ షైర్ లో ట్రంప్ నకు 46.7 శాతం, కమలా హరిస్ కు 52.4శాతం ఓట్లు
న్యూజెర్సీలో ట్రంప్ నకు 40.4శాతం, కమలా హరిస్ కు 59.6 శాతం ఓట్లు
ఓహియోలో ట్రంప్ నకు 56శాతం, కమలా హరిస్ కు 43.2శాతం ఓట్లు
ఒక్లాహోమాలో ట్రంప్ నకు 66.8శాతం, కమలా హరిస్ కు 31.3 శాతం ఓట్లు
రోడిఐలాండ్ లో ట్రంప్ నకు 44.5శాతం, కమలా హరిస్ కు 53.3 శాతం ఓట్లు
సౌత్ కరోలినాలో ట్రంప్ నకు 58.8శాతం, కమలా హరిస్ కు 39.9 శాతం ఓట్లు
సౌత్ డకోటాలో ట్రంప్ నకు 71.5శాతం, కమలా హరిస్ కు 26.4 శాతం ఓట్లు
టెన్నెస్సిలో ట్రంప్ నకు 65శాతం, కమలా హరిస్ కు 33.7శాతం ఓట్లు
టెక్సాస్ లో ట్రంప్ నకు 56శాతం, కమలా హరిస్ కు 42.8 శాతం ఓట్లు
వర్మంట్ లో ట్రంప్ నకు 31.9శాతం, కమలా హరిస్ కు 65 శాతం ఓట్లు
వెస్ట్ వర్జీనియలో ట్రంప్ నకు 70.1శాతం, కమలా హరిస్ కు 28 శాతం ఓట్లు
వ్యోమింగ్ లో ట్రంప్ నకు 65.6 శాతం, కమలా హరిస్ కు 33శాతం ఓట్లు