Biden
US President Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రష్యా – యుక్రెయిన్ యుద్ధంపై ఇటీవల చేస్తున్న ప్రకటనలు ఆ దేశానికే పాక్షిక నష్టం కలిగించే విధంగా ఉంటున్నాయి. యుద్ధం ఆరంభంలో నాటో తరుపున యుక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా చేస్తామంటూ ప్రకటించిన బైడెన్..ఆతరువాత ఆ నిర్ణయంపై వెనక్కుతగ్గారు. తాజాగా యుక్రెయిన్ లో రష్యా యుద్ధాన్ని నిలువరించేందుకు సహకరించడంతో “రష్యాను చూసి భారత్ భయపడుతోంది” అంటూ బైడెన్ చేసిన వ్యాఖ్యలపై భారత్ నొచ్చుకుంది. నాటో, అమెరికా, యురోపియన్ దేశాల చర్చల ద్వారానే రష్యా-యుక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరించుకోగలమనే తమ అభిప్రాయాన్ని ప్రధాని మోదీ గతంలోనే వెల్లడించారని..ప్రస్తుతం రష్యాపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేమని భారత్ తేల్చి చెప్పింది. అయితే బైడెన్ చేసిన “భారత్ భయపడుతోంది” వ్యాఖ్యలపై అమెరికా నష్టనివారణ చర్యలకు దిగింది.
Also read:Delhi Security: దేశ రాజధానికి ఉగ్రముప్పు: భద్రతా దళాలను హెచ్చరించిన యూపీ పోలీస్
క్వాడ్ కూటమిలో భారత్ తమకు అత్యంత ప్రధాన భాగస్వామి అని, భారత్ లేకుండా ఇండో పసిఫిక్ ప్రాంతంలో బహిరంగ, స్వేచ్ఛ కదలికలు సాధ్యం కాదని అమెరికా అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ వెల్లడించారు. విలువల విషయానికి వస్తే, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో రక్షణ మరియు భద్రత పరంగా భారత్ తో తమ భాగస్వామ్యం ఎంతో అవసరమని, చారిత్రక సంబంధాలు ఏమైనప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర భాగస్వామ్య దేశాలు మరియు మిత్రదేశాల మాదిరిగానే.. ఇప్పుడు భారత్ ను కూడా తమ భాగస్వామిగా చేర్చుకున్నామని నెడ్ ప్రైస్ చెప్పినట్లు వార్తా సంస్థ ANI తెలిపింది.
Also read:Petrol Price: వరుసగా రెండో రోజు పెరిగిన పెట్రోల్ ధరలు
అయితే అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేసిన వ్యాఖ్యలపై క్వాడ్ భాగస్వాములైన జపాన్ మరియు ఆస్ట్రేలియాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. భారత్ రష్యాల చారిత్రాత్మక సంబంధాలను తాము అర్థం చేసుకున్నామని ఇటీవల ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మొర్రిసన్ ప్రకటించగా, భారత్ లోని ఆస్ట్రేలియా రాయబారి బారీ ఓ ఫారెల్ కూడా మద్దతు పలికారు. మరోవైపు రష్యా చైనా సంబంధాలు బలోపేతం కావడంపై US రాజకీయ వ్యవహారాల అండర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ విక్టోరియా నులాండ్ ఆందోళన వ్యక్తం చేశారు.ఇటీవల భారత పర్యటనకు వచ్చిన ఆమె..చైనా విషయంలో భారత్ కు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని.. అవసరమైతే రక్షణ పరికరాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు.
Also read:International Flights: భారత్ కు వచ్చే అంతర్జాతీయ విమానాలలో కోవిడ్ ఆంక్షలు తొలగింపు