United States : స్టేజ్‌పై డ్యాన్స్ చేసిన తర్వాత విద్యార్థినికి డిప్లొమా ఇవ్వడానికి నిరాకరించిన స్కూల్ యాజమాన్యం .. కారణం?

స్కూలు నిబంధనలు అతిక్రమించిందని ఓ స్కూలు విద్యార్ధినికి వేదికపై డిప్లొమా సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించింది యాజమాన్యం. ఇంతకీ ఆమె చేసిన తప్పేంటి?

United States :

United States : కొన్ని నిబంధనలు కఠినంగా అనిపిస్తాయి. వాటిని అలాగే అమలు చేస్తారు కూడా. యూఎస్ ఫిలడెల్ఫియా హై స్కూల్ ఫర్ గర్ల్స్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా అందుకునేందుకు వెళ్లిన ఓ విద్యార్ధినికి డిప్లొమా సర్టిఫికేట్ ఇవ్వలేదు. ప్రేక్షకులు ఆమెను చూసి నవ్వడమే కారణమట.

US restaurant launches Modi ji thali: ప్రధాని మోదీ అమెరికా పర్యటన..యూఎస్ రెస్టారెంట్‌లో మోదీజీ పేరిట థాలీ ప్రారంభం

కొన్ని స్కూళ్లలో ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. వాటిని విద్యార్ధులు అతిక్రమిస్తే నిర్వాహకులు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు అనడానికి ఇప్పుడు చెప్పబోయే సంఘటన చదివితే అర్ధం అవుతుంది. ది ఫిలడెల్ఫియా హైస్కూల్ ఫర్ గర్ల్స్ నుండి గ్రాడ్యుయేట్ అయిన 17 యువతి డిప్లొమా సర్టిఫికేట్ అందుకోవడానికి స్టేజ్ పైకి వెళ్లింది. అందుకునేందుకు వెళ్తూ ఆమె డ్యాన్స్ చేయడం.. ఆమె స్పందన చూసి ప్రేక్షకులు నవ్వడం జరిగిపోయాయి. సరిగ్గా సమయానికి ప్రిన్సిపాల్ అబ్దుర్-రెహ్మాన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆ విద్యార్ధినిని ఆమె సీటులోకి వెళ్లి కూర్చోమనడం మనకు వీడియోలో కనిపిస్తుంది. స్కూలు నిబంధనల ప్రకారం విద్యార్ధిని డ్యాన్స్ చేయడం.. ప్రేక్షకులు నవ్వడం వంటివి విరుద్ధమని అందుకే ఆమె స్టేజిపై డిప్లొమో అందుకోలేకపోయిందని ప్రిన్సిపల్ తెలిపింది.

220 Kg Of Pasta in US Forest : యూఎస్ పారెస్ట్‌లో 220 కేజీల పాస్తా ఎందుకు పడేశారు?

ఈ విద్యార్ధినితో పాటు మరో ముగ్గురు బాలికలు తమ డిప్లొమాలను వేదికపై అందుకోలేదట.. వేడుక తర్వాత వారికి వీరికి స్కూల్ నిర్వాహకులు సర్టిఫికేట్లు అందించారట. @brianasmithnews అనే ట్విట్టర్ యూజర్ ద్వారా షేరైన ఈ ఈవెంట్ వీడియో వైరల్ అవుతోంది.