220 Kg Of Pasta in US Forest : యూఎస్ పారెస్ట్‌లో 220 కేజీల పాస్తా ఎందుకు పడేశారు?

ఎవరైనా 5 కిలోలు.. 10 కిలోలు పాడైన పాస్తాను బయట పారేస్తారు. ఏకంగా 220 కిలోల పాస్తా అడవిలో పారేయడమంటే అనుమానాలు వస్తాయి. న్యూజెర్సీ అటవీ ప్రాంతంలో 220 కేజీల పాస్తాను ఎవరో పారేయడంతో ఈ వార్త వైరల్ గా మారింది.

220 Kg Of Pasta in US Forest : యూఎస్ పారెస్ట్‌లో 220 కేజీల పాస్తా ఎందుకు పడేశారు?

 220 Kg Of Pasta in US Forest

220 Kg Of Pasta in US Forest : న్యూజెర్సీలోని ఓల్డ్ బ్రిడ్జ్‌ సమీపంలోని అడవిలో 220 కిలోల పాస్తా కనిపించింది. ఇన్ని కేజీల పాస్తా ఎవరు పడేసారన్నది పెద్ద చర్చకు దారి తీసింది.

Rs 40 Crore Claiming..Pasta Company : చెప్పిన టైమ్‌కి పాస్తా ఉడకలేదని ‘ఫుడ్ కంపెనీపై రూ. 40 కోట్లు’ దావా వేసిన మహిళ

న్యూజెర్సీ అడవిలో 500 పౌండ్లు అంటే 220 కేజీల పాస్తాను పడేశారు. ఆ ప్రాంతంలో నివాసం ఉండే నినా జోచ్నో విట్జ్ అనే వ్యక్తి ఈ పాస్తాను చూడగానే ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారాయి. ఇక ఈ పాస్తా ఎవరు పడేశారు? వండిందా? లేదా? అనే చర్చలు మొదలయ్యాయి. కేవలం నూడుల్స్ కుప్పలుగా పడేసారు. ఈ ఫోటోలు వైరల్ అయిన తరువాత ఇద్దరు పబ్లిక్ వర్క్స్ ఉద్యోగులు పాస్తాను తొలగించి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశారు. ఇక ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

పాస్తా తినడం వల్ల ఊహించిన దాని కంటే ఎక్కువ లాభాలు

అయితే మిస్టరీని ఛేదించారట. వర్షం, తేమ కారణంగా పాడైన పాస్తాను ఓ వ్యక్తి అక్కడ పారేశారని.. అయితే ఆ వ్యక్తి వివరాలు వెల్లడించవద్దని రిక్వెస్ట్ చేశారని ఈ పోస్టును షేర్ చేసిన నినా జోచ్నో విట్జ్ తెలిపింది. మొత్తానికి పాస్తా పాడైన కారణంగా అక్కడ పారేశారని మాత్రం తేల్చారు.